ఏపీ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ మేరకు అమరావతిలో జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ మేరకు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని.జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు ఆమోదం తెలిపింది క్యాబినెట్.
అలాగే నవశకం ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు.సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.రేషన్ కార్డుకు అర్హత మార్పు.2,50,000 వార్షిక ఆదాయం, 10 ఎకరాలలోపు మాగాణి, 25 ఎకరాలలోపు మెట్ట ఉన్నవారు అర్హులు.జగనన్న వసతి దీవెన కింద రూ.2300కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.3400కోట్లు కేటాయింపు, కడప ఉక్కు పరిశ్రమకు ముడిసరుకు కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం చెప్పింది.జమ్మలమడుగు మండలం పెదదండ్లూరు వద్ద 3,200 ఎకరాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు.వైఎస్‌ఆర్ కాపు నేస్తం పథకానికి రూ.1101కోట్లు కేటాయింపు.కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15వేల ఆర్థిక సహాయం.45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు అందించాలని నిర్ణయించుకున్నారు.ఇక ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
ఏపీఎస్‌పీడీసీఎల్‌ను విభజించి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.ఇకపై టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంచాలని చూస్తున్నారు.
ఒప్పంద ఉద్యోగుల అంశంపై కూడా ఓ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy