నేడు ఏపీ కేబినెట్ సమావేశం

నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది.సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.

ఇందులో భాగంగా మొత్తం 32 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

జనవరిలో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆమోదం తెలపనుంది.మాండూస్ తుపాను పరిహారం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.

స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపిన పెట్టుబడులకు మంత్రివర్గం ఇవ్వనుంది.అదేవిధంగా టీచర్ల బదిలీపై కీలక నిర్ణయంతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ కు రెండు విడతల్లో రూ.8,800 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుందని సమాచారం.కేబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్ మంత్రులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు