ఎన్టీఆర్ జిల్లాలో ఏపీ బీజేపీ కార్యవర్గ సమావేశం

ఎన్టీఆర్ జిల్లాలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది.రూ.

2 వేల నోటు ఉపసంహరణ సాహసోపేత నిర్ణయమని తెలిపారు.రూ.2 వేల నోట్లు చాలా కాలం నుంచి కనబడటం లేదని సోము వీర్రాజు అన్నారు.ఏపీలో పంచాయతీ స్థాయి నుంచి ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే, సీఎం వరకు అవినీతిమయమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అంతా కార్మిక నేతలుగా మారిపోయారన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని చెప్పారు.

ఉద్యోగులపై ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.ఏపీ ఉద్యోగులకు ఇలాంటి పరిస్థితి ఏనాడూ రాలేదని వెల్లడించారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు