ఎన్టీఆర్ లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అంటున్న ఏపీ బీజేపీ కీలక నేత..!!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ కావడం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సంచలనం రేపింది.

ఇద్దరి మధ్య దాదాపు గంటకు పైగా చర్చలు జరిగినట్లు వివిధ అంశాలపై చర్చించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ లో మంచి నాయకుడి లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు ఎవరితోనైనా కలిసి పని చేస్తాం.అమిత్ షా తో ఎన్టీఆర్ సమావేశం లో చాలా అంశాలపై చర్చలు జరిగాయని పేర్కొన్నారు.

తెలుగు చలనచిత్ర రంగంలో మాత్రమే కాదు దక్షిణాదిలో ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ఉంది.ఒక ప్రముఖ నటుడు మరియు ఒక ప్రముఖ రాజకీయ నేత భేటీ కచ్చితంగా సమాజం మీద ప్రభావం ఉంటుంది.2009 నుండి క్రియాశీలక రాజకీయాలకు ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు.కథ కొంతకాలం నుండి చూస్తే చాలామంది నటీనటులు బీజేపీతో కలుస్తున్నారు.

Advertisement

దీంతో నిన్న ఎన్టీఆర్ కలవడం బట్టి చూస్తే కచ్చితంగా మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలుస్తోంది అని పేర్కొన్నారు.ఏది ఏమైనా ఏపీలో వైసీపీని అధికారంలోకి దించేయాలి అదే తమ లక్ష్యం అని తాజా ఎన్టీఆర్ భేటీ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement