AP BJP Chief Purandeshwari : పురంధేశ్వరి రాజీనామా ప్రచారం ఖండించిన ఏపీ బీజేపీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 50 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికలలో విజయం సాధించడానికి నేతలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు.

ప్రస్తుతం చాలా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నం అయ్యాయి.ఎట్టి పరిస్థితులలో విజయం సాధించే దిశగా సరికొత్త అస్త్రాలతో ఎన్నికలను ఎదురుకోవడానికి సిద్ధమవుతున్నాయి.2014లో ఏర్పడిన కూటమి టీడీపీ.బీజేపీ.జనసేన( TDP BJP Janasena Alliance ) మూడు పార్టీలు మరోసారి కలవడం జరిగింది.2024లో కూడా విజయం సాధించాలని ఈ మూడు పార్టీల నాయకులు భావిస్తున్నారు.

కాగా ఎన్నికల సమీపిస్తున్న కొలది సోషల్ మీడియా వేదికగా రకరకాల ఫేక్ వార్తలు పుట్టుకు రావటం తెలిసిందే.ఈ రకంగానే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి( AP BJP Chief Purandeshwari ) గురించి సరికొత్త వార్త వైరల్ అవుతుంది.ఆమె భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది.

దీంతో వెంటనే ఏపీ బీజేపీ స్పందించడం జరిగింది."సోషల్ మీడియాలో పురంధేశ్వరి రాజీనామా( Purandeshwari Resignation ) లెటర్ ఫేక్.

Advertisement

ఎన్డీఏ కూటమి వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ అని గమనించగలరు" అని ట్వీట్ చేయటం జరిగింది.ఇటీవల విశాఖ తీరంలో దొరికిన డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు రావటంతో పురంధేశ్వరి పేరిట రాజీనామా చేస్తున్నట్లు ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేశారు.

ఈ క్రమంలో ఆ ఫేక్ లెటర్ వైరల్ కావడంతో ఏపీ బీజేపీ ఖండించటం జరిగింది.

Advertisement

తాజా వార్తలు