AP BJP : రెండు రోజులపాటు ఏపీ బీజేపీ ముఖ్యనేతల భేటీ..!!

ఏపీలో బీజేపీ( AP BJP ) ముఖ్యనేతలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ మేరకు రేపు, ఎల్లుండి కాషాయ నేతలు భేటీ కానున్నారు.

కోర్ కమిటీ నాయకులతో పాటు జిల్లాల నుంచి ముఖ్యమైన నేతలకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆహ్వానాలు పంపిందని తెలుస్తోంది.అదేవిధంగా ఈ సమావేశాలకు జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ జీ( Shiv prakash ) హాజరుకానున్నారు.

రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంతో పాటు పొత్తులపై ప్రధానంగా నేతలు చర్చించే అవకాశం ఉందని సమాచారం.ఈ క్రమంలోనే మరో వారం రోజుల్లో ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు