న్యూస్ రౌండప్ టాప్ 20

1.మంత్రి మల్లారెడ్డి విమర్శలు

కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు చంపుతానని బెదిరిస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి సంచలన విమర్శలు చేశారు.

2.కాలేశ్వరం ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి విమర్శలు

లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంగా మారిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.

3.ఏపీ క్యాబినెట్ మీటింగ్ పై లోకేష్ విమర్శలు

రైతన్న కరువుకు వదిలేసిన కర్కసక ప్రభుత్వం అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు .కరువు పై చర్చించని క్యాబినెట్ మీటింగ్ ఎందుకని ఆయన మండిపడ్డారు.

4.భట్టి విక్రమార్క కామెంట్స్

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే పూర్తిగా అమలు చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

5.అచ్చెన్న నాయుడు విమర్శలు

చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదుకు జగన్ సమయాన్ని అంతా వెచ్చిస్తున్నారు అని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.

6.విజయ సాయి రెడ్డి పై పురందరేశ్వరి విమర్శలు

వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి పై భారత ప్రధాన న్యాయమూర్తికి బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఫిర్యాదు చేశారు.ఆయన బెయిల్ రద్దు చేయాలని పురందరేశ్వరి కోరారు.

7.ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి చంద్రబాబు

Advertisement

తిరుపతి నుంచి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కు వెళ్ళనున్నారు.ఈరోజు ఆయన కంటి పరీక్షలు చేయించుకుని సర్జరీ చేయించుకునే అవకాశం ఉన్నట్లు టిడిపి వర్గలు పేర్కొన్నాయి.

8.బిజెపి బీఆర్ఎస్ లపై మావోయిస్టుల కరపత్రాలు

బిజెపి బీఆర్ఎస్ పార్టీలను తన్నితరమాలంటూ మావోయిస్టుల పేరుతో కరపత్రాలు బయటకు వచ్చాయి.

9.సిద్దిపేటకు కేసీఆర్

నేడు సిద్దిపేటకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.నంగునూరు మండలం కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

10.కెసిఆర్ ఇంజనీర్ల మాట వినలేదు

సీఎం కేసీఆర్ ఇంజనీర్ల మాట వినకపోవడం వల్లే కాలేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడుతున్నాయని తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్లు,  యాదవులు స్పష్టం చేశారు.

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్ష కార్యదర్శులు ఆధ్వర్యంలో పొంగుతున్న కాలేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు పరిష్కార మార్గాలు ఏమిటి అని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది .ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

11.రేపు మాదిగల యుద్ధభేరి

సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయవాటాల కోసం ఈనెల 5న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద మాదిగల యుద్ధభేరి నిర్వహించనున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ తెలిపారు.

12.తుమ్మల నాగేశ్వరావు విమర్శలు

టిఆర్ఎస్ పాలనలో అవినీతి విధ్వంసం అరాచకం పెచ్చు మీరాయని ఏపీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వ్యాఖ్యానించారు.

13.పురందేశ్వరి పై విజయ సాయి వ్యాఖ్యలు సరికాదు.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరిశ్వరి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు.

14.ముఖేష్ అంబానికి బెదిరింపులు

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానికి బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి , తాము అడిగినంత ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా వచ్చిన మెయిల్ లో పేర్కొన్నారు.

15.నేపాల్ లో భారీ భూకంపం

నేపాల్ పెను భూకం పం లో పలువురు మరణించగా ఎంతో మంది గాయపడ్డారు.ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు.

16.అన్నవరం దేవస్థానం వ్రతం టికెట్ ధర పెంపు

Advertisement

అన్నవరం దేవస్థానం 800 వ్రత టికెట్ ను వెయ్యి కి పెంచుతూ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది.

17.శంషాబాద్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభం

 రాజు గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 3 దశ విస్తరణలో భాగంగా తూర్పు భాగంలో 2.17 లక్షల చదరపు మీటర్ల మేర చేపట్టిన టెర్మినార్ భవనం నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

18.ఆన్లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనం కోసం 2.25 లక్షల రూ.300 టికెట్లను ఈ నెల వదిన ఆన్లైన్ లో జరిగిన టీటీడీ ఈవో ఏవీ ధర్మ రెడ్డి తెలిపారు.

19.హైదరాబాద్ పారిశ్రామికవేత్తకు జపాన్ పురస్కారం

హైదరాబాద్ లోని ఆశ భాను జపాన్ సెంటర్ అధ్యక్షుడు పారిశ్రామిక బొడ్డుపల్లి జపాన్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ది రైసింగ్ సన్, గోల్డ్ రెస్ విత్ రోసెట్  పురస్కారానికి ఎంపిక చేసింది.

20.ఈనెల 21 నుంచి సమగ్ర కుల గణన

ఈనెల 21 నుంచి సమగ్ర కులగలను చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.

21.సీఎం జగన్ కు రాజధాని రైతుల నిరసన

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అమరావతి పరిధిలోని మందడంలో రాజధాని రైతులు నిరసన తెలిపారు.

అటుగా సచివాలయం కి వెళ్తున్న సమయంలో రైతులు మహిళలు శిబిరం ముందు నిలిచిన జండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు