స్టార్ హీరోలు కొట్టుకుంటుంటే ‘నిశబ్దం’గా మొదలుపెడుతోన్న స్వీటీ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క బాహుబలి చిత్రం తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది.

గతేడాదిలో భాగమతి చిత్రం తరువాత మరే ఇతర సినిమాను ఆమె చేయలేదు.

చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డిలో కేమియో పాత్ర మాత్రమే చేసింది.ఆమె సైజ్ జీరో చిత్రం కోసం పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతోంది.

కాగా అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ నిశబ్దం గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ ముగించేసుకుంది.ఈ సినిమాలో అనుష్క ఓ మూగ మరియు చెవిటి మనిషిలా నటిస్తోంది.

ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాను జనవరి 31న రిలీజ్‌కు రెడీ అయ్యింది.అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ జరుపుకోని ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను పండగ తరువాత మొదలుపెడతామని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Advertisement

పండగ పూట స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో కొట్టుకుంటుంటే అనుష్క మాత్రం నిశబ్దంగా తన సినిమా ప్రచారం గురించి చెప్పుకొచ్చింది.ఏదేమైనా అనుష్క తన సినిమాలపట్ల తనదైన స్ట్రాటజీని ప్రదర్శిస్తూ మిగతా హీరోయిన్లకు స్పూ్ర్తిగా నిలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు