పవన్‌కు సరోజ బెటర్ అంటోన్న క్రిష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రీఎంట్రీ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో ‘వకీల్‌ సాబ్’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు పవన్.

Anushka To Pair With Pawan Kalyan, Anushka, Pawan Kalyan, Krish, Jacqueline Fern

దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్‌ను హీరోయిన్‌గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ ఆసక్తిగా ఉందంటూ వార్తలు వినిపించాయి.

Advertisement

కానీ దర్శకుడు క్రిష్ మాత్రం బాలీవుడ్ అందాలకు నో అంటున్నాడు.ఈ సినిమాలో స్వీటీ అనుష్కను తీసుకోవాలని భావిస్తున్నాడట.

గతంలో క్రిష్ తెరకెక్కించిన వేదం చిత్రంలో అనుష్క ఓ వేశ్య పాత్రలో నటించింది.దీంతో ఇప్పుడు మరోసారి ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తున్నాడట క్రిష్.

మరి పవన్ సరసన అనుష్క నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ఎండల వల్ల మీ ముఖం మెడ నల్లగా మారాయా.. ఈ రెమెడీతో 20 నిమిషాల్లో చర్మాన్ని రిపేర్ చేసేయండి!
Advertisement

తాజా వార్తలు