మారిషస్‌లో భారత కొత్త హైకమీషనర్‌గా అనురాగ్ శ్రీవాస్తవ

హిందూ మహాసముద్రంలో మనదేశానికి కీలక భాగస్వామిగా ఉన్న మారిషస్‌లో( Mauritius ) భారత కొత్త హైకమీషనర్‌గా 1999 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి అనురాగ్ శ్రీవాస్తవ( Anurag Srivastava ) నియమితులయ్యారు.

ఈ మేరకు భారత విదేశాంగ శాఖ శనివారం ఉత్వర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం ఆయన విదేశాంగ శాఖలో జాయింట్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు.అనురాగ్ త్వరలోనే మారిషస్‌లో హైకమీషనర్‌గా( Mauritius High Commissioner ) బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ నియామకంతో మారిషస్‌తో దీర్ఘకాల సంబంధాలపై భారత్ ఇస్తున్న ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుంది.పశ్చిమ హిందూ మహా సముద్ర ప్రాంతంలో మనదేశానికి కీలక భాగస్వామి అయిన మారిషస్.

ఇండియాతో లోతైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను పంచుకుంటోంది.

Advertisement

మారిషస్‌లో 1.2 మిలియన్ల మంది జనాభాలో దాదాపు 70 శాతం భారత సంతతతి వారే కావడం గమనార్హం.భారత్ - మారిషస్ మధ్య ద్వైపాక్షిక సంబంధం చారిత్రాత్మకమైనది.

భారతీయ కార్మికులు మొదటిసారిగా 1729లో ఫ్రెంచ్ పాలన సమయంలో మారిషస్‌కు చేరుకున్నారు.భారతదేశ పగ్గాలు బ్రిటీష్ వారి చేతుల్లోకి వెళ్లిన తర్వాత 1834, 1900ల తొలినాళ్లలో దాదాపు రూ.5 లక్షల మంది భారతీయ కార్మికులు మారిషస్‌కు తీసుకురాబడ్డారు.

నవంబర్ 2, 1834లో అట్లాస్ అనే నౌకలో మొదటి బ్యాచ్ కార్మికులు వచ్చిన రోజును మారిషస్‌లో ఆప్రవాసి దివస్‌గా జరుపుకుంటారు.మారిషస్ స్వాతంత్య్రం పొందటానికి 20 ఏళ్ల ముందు 1948లో భారత్ - మారిషస్ మధ్య దౌత్య సంబంధాలు( Diplomatic Relations ) మొదలయ్యాయి.సముద్ర భద్రత, అభివృద్ధి, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి.

మారిషస్ వ్యాప్తంగా భారత్ సాయంతో నెలకొల్పిన ప్రాజెక్ట్‌లు, ఇండియన్ కల్చరల్ సెంటర్, మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ , ప్రపంచ హిందీ సెక్రటేరియట్ వంటి సంస్థలు మొదలైనవి ఉన్నాయి.కాగా.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

కొద్దిరోజుల క్రితం ఫ్రాన్స్‌లో భారత కొత్త రాయబారిగా 1997 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి (ఐఎఫ్ఎస్) , సీనియర్ దౌత్యవేత్త సంజీవ్ కుమార్ సింగ్లా నియమితులైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం సింగ్లా ఇజ్రాయెల్‌లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు