అలా మాట్లాడినందుకు డైరెక్టర్ కి అనుపమ బహిరంగ క్షమాపణ!

నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా అన్ని భాషలలోనూ మంచి కలెక్షన్లను రాబడుతూ విజయపతంలో దూసుకుపోతోంది.

ఇకపోతే ఈ సినిమా విజయవంతం కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ డైరెక్టర్ చందు మొండేటికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.ఈ విధంగా అనుపమ డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

గుజరాత్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు వెన్ను నొప్పి అధికంగా వచ్చిందని అయినా ఈ షెడ్యూల్ కష్టపడి పూర్తి చేశానని తెలిపారు.అయితే ఒక రోజు టెక్నికల్ సమస్య కారణంగా షూటింగ్ బాగా ఆలస్యం అవడంతో చాలా ఫ్రస్టేషన్ కి గురై డైరెక్టర్ చెందుతో పనిచేయడానికి తను చాలా రిగ్రేట్ ఫీలవుతున్నానని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.

Anupama Public Apology To The Director For Speaking Like That Nikhil, Anupama Pa
Advertisement
Anupama Public Apology To The Director For Speaking Like That Nikhil, Anupama Pa

ఆరోజు తాను అలా మాట్లాడి ఉండకూడదు నేను చేసింది పెద్ద తప్పు.ఆయనను అలా అన్నందుకు చాలా బాధపడ్డానని ఈ సందర్భంగా డైరెక్టర్ చందు మొండేటికీ బహిరంగంగా అనుపమ పరమేశ్వరన్ క్షమాపణలు తెలియజేశారు.ఇలా ఆయనతో పని చేయడం వల్లే ఈరోజు ఇంత మంచి విజయాన్ని అందుకున్నామని ఈ సినిమా విజయాన్ని ఇప్పటికి తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఈ సందర్భంగా అనుపమ వెల్లడించారు.

ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు