అనుపమ, ప్రకాష్‌ రాజ్‌ల మద్య అసలేం జరిగిందంటే?

రామ్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా త్రినాధరావ్‌ నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమేరా’.

ఈ చిత్రం చిత్రీకరణలో చిన్న వివాదం నెలకొన్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌ మరియు హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ తండ్రి కూతుర్లుగా కనిపించబోతున్నారు.వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సీన్‌ చిత్రీకరిస్తున్న సమయంలో గొడవ జరిగినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

వీరిద్దరు గొడవ పడటంతో రోజంతా కూడా షూటింగ్‌కు అంతరాయం కలిగినట్లుగా తెలుస్తోంది.గొడవ పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ప్రకాష్‌ రాజ్‌, అనుపమల కాంబినేషన్‌లో ఒక సీన్‌ను దర్శకుడు అనుకున్నాడు.ఆ సీన్‌ గురించి ముందే దర్శకుడు అనుపమకు చెప్పడం జరిగింది.

Advertisement

డైలాగ్స్‌ కూడా అనుపమ ప్రాక్టీస్‌ చేసిందట.కాని ప్రకాష్‌ రాజ్‌ సూచన మేరకు దర్శకుడు సీన్‌ను కాస్త మార్చి రాశాడు.

డైలాగ్స్‌ కూడా మళ్లీ కొత్తగా రాయడం జరిగింది.ఆ విషయం పట్ల అనుపమ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది.

చివరి నిమిషంలో ఇలా సీన్స్‌ మారిస్తే ఎలా అంటూ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిందట.ఆ సమయంలోనే ప్రకాష్‌ రాజ్‌ ఆమెకు సర్దిచెప్పబోతుండగా ఆయనపై అరిచిందని, దాంతో ప్రకాష్‌ రాజ్‌ హర్ట్‌ అయ్యి ఆయన మరింతగా ఆగ్రహంతో ఊగిపోయినట్లుగా తెలుస్తోంది.

వీరిద్దరి మద్య గొడవ పెరిగి పెద్దది అవ్వకుండా దర్శకుడు మరియు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు వెంటనే వారిద్దరిని విడదీసినట్లుగా తెలుస్తోంది.గొడవ లేకున్నా కూడా ఇద్దరు కూడా కలిసి నటించేందుకు ఒప్పుకోలేదు.ఇద్దరు కూడా రోజంతా కూడా మౌనంగానే సెట్స్‌లో కూర్చుండి పోయారు.

దాంతో దర్శకుడు ఇతర సీన్స్‌ను ప్లాన్‌ చేశాడు.రెండు రోజుల తర్వాత గొడవ సర్దుమనిగి మళ్లీ ఇద్దరు కలిసి నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Advertisement

ఈవిషయాన్ని బయటకు పొక్కకుండా దర్శకుడు ప్రయత్నాలు చేశాడు.అయినా కూడా రెండు మూడు రోజుల్లో మీడియాకు ఆ విషయం తెలిసి పోయింది.

ఇటీవలే అనుపమ పరమేశ్వరన్‌ నటించిన ‘తేజ్‌ ఐవ్‌ యూ’ చిత్రం విడుదలైంది.ఆ సినిమా కాస్త ఫలితం తారు మారు అయ్యింది.

దాంతో అనుపమ కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని, సీనియర్స్‌తో సున్నం పెట్టుకుంటే సినిమాల్లో ఆఫర్లే కష్టం అవుతాయి అంటూ సినీ వర్గాల వారు హెచ్చరిస్తున్నారు.అనుపమ గతంలో కూడా ఒకసారి ఒక సీనియర్‌ నటితో విభేదించింది.

ఆమెపై సెట్స్‌లోనే అరిచి అక్కడ నుండి వెళ్లి పోయినట్లుగా ప్రచారం జరిగింది.అనుపమ సక్సెస్‌లేని ఈ సమయంలో కాస్త సైలెంట్‌గా ఉండటం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

తాజా వార్తలు