జీవితం చిన్నది ఆరోజు ఎప్పుడొస్తుందో తెలియదు... అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్!

అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) పరిచయం అవసరం లేని నటి ప్రేమమ్( Premam ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక గత ఏడాది ఈమె నటించిన కార్తికేయ 2 ( Karthikeya 2 )సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా భావోద్వేగాలను ( Expression )వ్యక్తపరిచే విషయం గురించి పలు విషయాలను వెల్లడించారు.

బాగోదేగాలను వ్యక్తపరిచే విషయంలో మీరు ఏ విధంగా ఆలోచిస్తారు అంటూ తనకు ప్రశ్న ఎదురైంది.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.తాను బాబోద్వేగాలను బయటపెట్టే విషయంలో చాలా నిజాయితీగా ఉంటానని తెలిపారు.

ఏదైనా పని తనకు నచ్చకపోతే నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పేస్తానని అయితే ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతాను అంటూ ఈమె తెలియజేశారు.ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మన ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదని తెలిపారు.

Advertisement

మన జీవితం చాలా చిన్నది.ఈ జీవితంలో మనం కొద్ది రోజులు ఇక్కడ నివసించి మనకు ఇష్టం వచ్చిన విధంగా నటిస్తూ తిరిగి ఏదో ఒక రోజు వెళ్లిపోయే వాళ్ళమని తెలిపారు.అయితే ఆరోజు ఎప్పుడు వస్తుందనేది మాత్రం ఎవరికీ తెలియదు.

అందుకే బ్రతికున్న రోజులు చాలా మంచిగా ఎలాంటి ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని నేను అనుకుంటానని అనుపమ తెలియజేశారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా నెల రోజుల లోపు ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది.

అలాగే నా మైండ్ లో ఉన్నటువంటి చెత్తను కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా ఈ మెసేజ్ చూసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Garam masala : భారతీయులు ఉపయోగించే గరం మసాలాతో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!
Advertisement

తాజా వార్తలు