500 రూపాయల నోట్లపై అనుపమ్ ఖేర్ ఫోటో.. ఫోటోపై ఆయన రియాక్షన్ ఇదే!

ప్రస్తుతం సోషల్ మీడియాలో నకిలీ కరెన్సీ నోట్లు( Fake Currency Notes ) కలకలం రేపుతున్నాయి.

ముఖ్యంగా కొందరి నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తున్నారు.

న‌కిలీ క‌రెన్సీ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం, ఆర్‌బీఐ ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికి వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించ‌లేక‌పోతున్నాయి.తాజాగా న‌కిలీ క‌రెన్సీ ముఠా గుట్టును ర‌ట్టు చేశారు అహ్మ‌దాబాద్ పోలీసులు.

( Ahmedabad Police ) అయితే ఈ నోట్ల‌ను చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.ఈనోట్ల‌పై గాంధీ చిత్రానికి బ‌దులుగా బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్( Anupam Kher ) ఫోటో ఉంది.

నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు బదులుగా రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించారు.నిందితులు ఈ నోట్ల‌ను ఉప‌యోగించి 2100 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.ప‌లువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.1.60 కోట్ల విలువైన నకిలీ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.న‌కిలీ క‌రెన్సీకి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

Advertisement

దీనిపై న‌టుడు అనుప‌మ్ ఖేర్ స్పందించారు.

రూ.500 నోట్ల‌పై గాందీజీ ఫోటోకు( Gandhiji Photo ) బదులుగా నా ఫోటోనా అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు.ఏదైనా జ‌ర‌గవచ్చు అని ఆయన రాసుకొచ్చారు.

అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాంటి వారిని శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇకపోతే అనుపమ్ విషయానికి వస్తే.బాలీవుడ్ కి చెందిన అనుభవం దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు అనుపమ్.

Advertisement

తాజా వార్తలు