16ఏళ్ల బాలికను రేప్ నుంచి కాపాడిన చీమలు.! ఎలాగో తెలుస్తే ఆశ్చర్యపోతారు.!

ఇండోనేసియాలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.చీమలు చేసిన పని ఓ పదహారేళ్ల బాలిక అత్యాచారానికి గురికాకుండా ఆపింది.

చీమల దండు ఓ నిందితుడిని అదేపనిగా కుట్టి ఆ బాలికను రక్షించాయి.వివరాల లోకి వెళ్తే.

ఇండోనేషియాలో ఉంటున్న 16 ఏళ్ల ఓ అమ్మాయి, 29 ఏళ్ల టోని ఐర్వాన్‌ అనే వ్యక్తితో కలిసి లాంగ్ జర్నీకి వెళ్లింది.ఇద్దరూ సరదాగా ఎంజాయ్ చేశారు.

కొంతదూరం వెళ్ళాక కాసేపు కలిసి నిద్రపోదామని ఆ అమ్మాయిని అడిగాడు.కానీ అతడి దుర్భుద్ధి అర్థమైన బాలిక అందుకు ఒప్పుకోకపోవడంతో… ఆమెను బలవంతంగా పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లాడు.

Advertisement

ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు నిందితుడు.

అయితే అక్కడున్న చెట్లు చేమల మధ్య చీమల దండు ఉంది.అవన్నీ ఒక్కసారిగా టోనిపై దాడికి దిగాయి.ఒకేసారి ఎక్కువ మొత్తంలో నల్లచీమలు అతడిని కుట్టడంతో…ఖంగు తినడం టోనీ వంతైంది.

అదే అదునుగా ఆమె వెంటనే రక్షించాలి అని కేకలు పెడుతూ సమీపంలోని ఇళ్లలోకి పరుగులు పెట్టింది.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే వచ్చిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

అతనిని రిమాండుకు తరలించారు.ఈ సంఘటన దాదాపు వారం రోజుల క్రితం జరిగింది.

చిప్స్ ఇష్టంగా తింటున్నారా..అయితే ఇది చదివితీరాల్సిందే....
Advertisement

తాజా వార్తలు