నిన్న మొన్న ఎన్టీఆర్ శత జయంతి( NTR 100th birth anniversary ) ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హాజరు కాకపోవడంతో చాలా చోట్ల అతనిపై నిరసన గళం వినిపిస్తోంది.
హరికృష్ణ పెళ్లి చేసుకోకుండానే శాలిని అనే అమ్మాయికి కడుపు చేస్తే పుట్టాడు అలాంటి వ్యక్తికి నందమూరి వారసుడు అంటూ పట్టం కడితే ఈ రోజు పెద్దాయన జయంతి ఉత్సవాలకు కూడా రాలేని బిజీలో ఉన్నాడా అంటూ పలువురు తెలుగుదేశం ( TDP Party )పార్టీ సానుభూతిపరులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
అసలు నీకే ఎలాంటి దిక్కు లేదు నిన్ను తీసుకువచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గొప్పవాన్ని చేస్తే నందమూరి కుటుంబానికి ఇంతటి అన్యాయం చేస్తావా అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనామకుడిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను దరిచేర్చుకుని, ఒక స్థానం కల్పించి, పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇంతటి వాడిని చేస్తే బాబుకి ద్రోహం చేస్తున్నారు అంటూ కూడా ఒక మెట్టు దిగిపోయి దిగజారుడు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు టిడిపి పార్టీ తరఫున ప్రచారం చేసినవాడే చంద్రబాబు నాయుడు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడే.కానీ తన సొంత తాత శతజయంతి ఉత్సవాలకు వెళ్లకపోవడం వెనక ఏదో మతలబు ఉండకుండా ఉండదు.
ఈ శతజయంతి ఉత్సవాల వల్ల టిడిపి పార్టీకి బాబుకి తప్ప మరెవరికి లాభం లేదు అందుకే ఎన్టీఆర్ పార్టీని దూరం పెట్టే క్రమంలో శతజయంతి ఉత్సవాలకు వెళ్లకుండా ఉన్నాడు అని ఒక వర్గం అంటుంది.అయితే ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్లే ఎన్టీఆర్ తాత అయిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు హాజరు కాలేదని పలువురు చెప్పుకుంటున్నారు.
టిడిపి పార్టీకి తన తాత ఆది పురుషుడు లాంటి వ్యక్తి అలాంటి పార్టీ ఈరోజు ఎవరి చేతిలో ఉంది ఎక్కడ ఉంది ? ఎవరు నడిపిస్తున్నారు ? దానివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది ? నందమూరి వారికి అసలు టిడిపి పార్టీకి ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నారు? అంటూ కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు.వెళ్లడం వెళ్ళకపోవడం పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం.
దీనిపై ఎవరి జోక్యం అవసరం కూడా లేదు తన తాత పట్ల అతనికి ప్రేమ లేకుండా కూడా ఉండడు కానీ తన కారణాలు తనకు ఉంటాయి కదా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు దాడి చేస్తున్నారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy