కృష్ణా జిల్లాలో లోన్‎యాప్ వేధింపులకు మరొకరు బలి

కృష్ణా జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలయ్యారు.హనుమాన్ జంక్షన్ లో లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

డబ్బులు కట్టలేదని వేలేరుకు చెందిన రోహిత్ ను యాప్ నిర్వాహకులు వేధించినట్లు సమాచారం.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రోహిత్ బలవన్మరణం చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement