ప్రవళిక మృతి కేసులో మరో ట్విస్ట్..!!

ప్రవళిక మృతి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.శివరామ్ వేధింపుల కారణంగానే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

అదేవిధంగా ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని మృతురాలి తల్లి, సోదరుడు కోరారు.ప్రవళిక హాస్టల్ లో ఉన్నప్పుడు శివరామ్ పలు విధాలుగా వేధించేవాడని ఆరోపించారు.

ఈ వేధింపులు తాళలేకనే బలవన్మరణానికి పాల్పడిందని తెలిపారు.ఈ క్రమంలో ప్రవళిక మృతికి కారణమైన శివరామ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రవళిక మృతి కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని వెల్లడించారు.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players