సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రేటీలు ఈ మధ్యకాలం బాగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.
ముఖ్యంగా తమ వ్యక్తిగత విషయంలోనే బాగా హార్ట్ టాపిక్ గా నిలుస్తున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడిపోవడం.మళ్లీ మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో ఇది మామూలు విషయమే.
కానీ ప్రేక్షకులు మాత్రం ఈ విషయాన్ని కొన్ని కొన్ని సార్లు జీర్ణించుకోలేరు.ఇప్పటికే ఇండస్ట్రీలలో మంచి క్యూట్ కపుల్ గా ఉన్న నాగచైతన్య, సమంతలు విడిపోయి టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చారు.
ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య కు విడాకులు ఇచ్చి ఆయన షాక్ కు గురి చేశాడు.ఆ తర్వాత అమీర్ ఖాన్-కిరణ్ రావుల విడాకుల గురించి కూడా తెలిసిందే.
కొంతమంది నటీనటులు లోలోపలే విడిపోయి బయటకు చెప్పకుండా నిజాలు దాచుతున్నారు.ఇక తాజాగా మరో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి విడాకుల వ్యవహారం బయటపడింది.
ఇంతకు ఆమె ఎవరంటే బాలీవుడ్ బుల్లితెర నటి సురభి తివారి.ఈమె బాలీవుడ్ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈమె తన భర్త నుండి విడాకులు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.2019లో ఈమె ప్రముఖ వ్యాపారవేత్త ప్రవీణ్ ను వివాహం చేసుకుంది.ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాను తన వ్యక్తిగత విషయాలు బయట పెట్టింది.
పెళ్లి తర్వాత తను తన భర్త ఒకేలా లేమని తెలిపింది.ఇక తన భర్త తనను ముంబైలో నివసించడానికి ముందుగా అంగీకరించాడని.
ఆ తర్వాత తను ముంబైకి రావడానికి నిరాకరించాడని తెలిపింది.
పెళ్లయినప్పటి నుంచి తన అత్తగారు తనని వేధిస్తున్నారు అంటూ.తన భర్తను తన దగ్గరికి పంపివ్వకుండా చేస్తున్నారు అని తెలిపింది.తనకు ముంబైలో రోజు షూటింగ్ లు ఉంటాయని.
తన భర్త వల్ల తన షూటింగులు మొత్తం ఆగిపోతున్నాయి అని.పైగా అవకాశాలు కూడా రాలేవు అని.ఈ విషయం వల్ల తన భర్తతో తనకు ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయని తెలిపింది.ప్రస్తుతం తను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అని.డబ్బుల కోసం తన నగలు అమ్ముకుంటున్నాను అని అన్నది.ఇక తన భర్త తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు అని.కానీ తనకు న్యాయపరంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.ఇక త్వరలో విడాకులు తీసుకోవడానికి దాఖలు కూడా చేస్తానని తెలిపింది.
తనకు పిల్లలు అంటే చాలా ఇష్టమని.కానీ తన భర్త తనను పిల్లలను కనడానికి నిరాకరించాడని.పైగా తనను బాడీ షెమింగ్ చేస్తూ తను తినే ఆహార పదార్థాలను నిషేధించడానికి ప్రయత్నించాడు అని తెలిపింది.
ఇక మొత్తానికి ఈమె మాట్లాడిన మాటలు వింటుంటే కచ్చితంగా ఈమె తన భర్త నుండి విడాకులు తీసుకోవడానికి వెనుకాడటం లేదు అని తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy