హైదరాబాద్ లో మ‌రో కు.ని ఆప‌రేష‌న్ ఫెయిల్..!

హైద‌రాబాద్ లో మ‌రో కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ ఫెయిల్ అయిన‌ట్లు తెలుస్తోంది.పేట్లబురుజు ఆస్ప‌త్రిలో ఓ మ‌హిళ శ‌స్త్ర‌చిక‌త్స చేయించుకుంది.

ఆప‌రేష‌న్ త‌ర్వాత స‌దరు మ‌హిళ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైంది.దీంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.

చికిత్స పొందుతూ మృతిచెందింది.కుటుంబ నియంత్ర‌ణ ఫెయిల్ కావ‌డంతోనే మ‌హిళ మృతిచెందింద‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై పేట్లబురుజు ఆస్ప‌త్రిలో డీఎంఈ విచార‌ణ చేప‌ట్టారు.దీనిలో భాగంగా సూప‌రింటెండెంట్ తో పాటు ఆప‌రేష‌న్ లో పాల్గొన్న వైద్యుల‌తో ఆయ‌న స‌మావేశం అయ్యారు.

Advertisement

కు.ని శ‌స్త్ర‌చికిత్స ఘ‌ట‌న‌పై ఆరా తీస్తున్నారు.ఇటీవ‌లే ఇబ్ర‌హీంప‌ట్నంలో కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు విఫలమై.

న‌లుగురు మ‌హిళ‌లు అస్వ‌స్థ‌త‌కు గురై మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

Advertisement