విరాట్ కోహ్లీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్.. ఆ జాబితాలో టాప్-5 స్థానంలోకి..!

భారత్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ( Virat Kohli )ఖాతాలో మరో సరికొత్త రికార్డు పడింది.

క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి తమ పేరులను లిఖించుకుంటున్న వారిలో విరాట్ కోహ్లీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది.

తాజాగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తో భారత తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలోకి విరాట్ కోహ్లీ చేరిపోయాడు.భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్( Virender Sehwag ) ను వెనుక్కు నెట్టి ఆ స్థానాన్ని విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో రెండవ రోజు గ్రీసులోకి వచ్చిన కోహ్లీ 24 పరుగుల వద్ద వీరేంద్ర సెహ్వాగ్ ను అధిగమించాడు.విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8515 పరుగులు చేశాడు.అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదవ స్థానానికి చేరుకున్నాడు.

ఆ జాబితాలో ముందున్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం.సచిన్ టెండుల్కర్: ( Sachin Tendulkar )భారత్ తరపున టెస్ట్ మ్యాచ్ లలో 329 ఇన్నింగ్స్ ఆడాడు.15921 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.రాహుల్ ద్రావిడ్: భారత్ తరపున టెస్ట్ మ్యాచ్ లలో 286 ఇన్నింగ్స్ ఆడాడు.13288 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.సునీల్ గవాస్కర్: భారత్ తరపున టెస్ట్ మ్యాచ్లలో 214 ఇన్నింగ్స్ ఆడాడు.10122 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

Advertisement

వీవీఎస్ లక్ష్మణ్: భారత్ తరపున టెస్ట్ మ్యాచ్ లలో 225 ఇన్నింగ్స్ ఆడాడు.8781 పరుగులతో ఆ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.విరాట్ కోహ్లీ: భారత్ తరపున టెస్ట్ మ్యాచ్లలో 186 ఇన్నింగ్స్ ఆడాడు.8515 పరుగులతో ఐదవ స్థానంలో నిలిచాడు.అయితే ఈ లిస్టులో వీరేంద్ర సెహ్వాగ్ 8503 పరుగులతో ఐదో స్థానంలో ఉండేవాడు.

కోహ్లీ ఐదవ స్థానాన్ని భర్తీ చేయడంతో వీరేంద్ర సెహ్వాగ్ ఆరవ స్థానానికి పడిపోయాడు.

Advertisement

తాజా వార్తలు