DOGE : ఎలాన్ మస్క్ బృందంలో మరో భారత సంతతి టెక్కీ.. ఎవరీ నిఖిల్ రాజ్‌పాల్?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) ఎన్నికైన తర్వాత ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడం, వ్యవస్ధలో సమూల మార్పులే లక్ష్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ( DOGE ) అనే వ్యవస్ధను కొత్తగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

దీనికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో( Elon Musk ) పాటు భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామిలను సారథులుగా నియమించారు.

అయితే అనూహ్యంగా వివేక్ రామస్వామి తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.అయితే మస్క్ మాత్రం తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ఇటీవల ఫెడరల్ ఉద్యోగుల జీత భత్యాలకు సంబంధించిన యాక్సెస్‌ను మస్క్ నేతృత్వంలోని యంత్రాంగం పొందింది.డీవోజీఈ కోసం పలువురు సమర్ధులైన యువకులను మస్క్ నియమించుకుంటున్నారు.

ఈ బృందంలో 19 నుంచి 24 ఏళ్ల వయసున్న యువత ఉన్నారు.వీరిలో ఎడ్వర్డ్ కొరిస్టీన్, ల్యూక్ ఫారిటర్, గౌటియర్ కోల్ కిల్లియన్, గవిన్ క్లిగర్, షావోట్రాన్, భారత సంతతికి చెందిన టెక్నీషియన్ ఆకాష్ బొబ్బాలు స్థానం దక్కించుకున్నారు.

Advertisement

తాజాగా డీవోజీఈ బృందంలో కీలక సభ్యుడిగా చెబుతున్న మరో భారత సంతతికి చెందిన టెక్కీ పేరు బయటికొచ్చింది.అతనిని 30 ఏళ్ల భారత సంతతికి చెందిన సాంకేతిక నిపుణుడు నిఖిల్ రాజ్‌పాల్‌గా( Nikhil Rajpal ) గుర్తించారు.కంప్యూటర్ సైన్స్, చరిత్రలో నైపుణ్యం ఇతని సొంతం, బర్కిలీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందిన రాజ్‌పాల్.

డీవోజీఈ టాస్క్‌ఫోర్స్‌లో ప్రభావవంతమైన వ్యక్తిగా మారారు.ది వైర్డ్ ప్రకారం అతను నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ)లో డీవోజీఈ ప్రతినిధిగా పనిచేస్తున్నాడు.

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందు.రాజ్‌‌పాల్ ఆ సంస్థలో పనిచేశాడు.

గతంలో టెస్లా కన్‌సోల్ రీడిజైన్ చేయడంతో కీలకపాత్ర పోషించాడు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

కాగా.డీవోజీఈలో ఇప్పటికే భారత సంతతికి చెందిన ఆకాష్ బొబ్బా( Akash Bobba ) స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన 22 ఏళ్ల బొబ్బా ప్రస్తుతం బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ హెడ్జ్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఇంజనీరింగ్ ఇంటర్న్‌గా ఉన్నారు.

Advertisement

గతంలో మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా, థీల్స్ పలాంటిర్ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌గా వ్యవహరించారు.

తాజా వార్తలు