ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం ఆరుగురు మృతి..!!

ఒడిశా రాష్ట్రం( Odisha )లో ఇటీవల ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

కోరమండల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ ను ఢీ కొనడంతో పెద్ద ప్రమాదం సంభవించింది.

దీంతో బోగీలు వేరే ట్రాక్ పై పడటంతో.అటు నుంచి వస్తున్న యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ కూడా ప్రమాదానికి గురికావడం జరిగింది.

ఈ దుర్ఘటన ప్రపంచం మొత్తాన్ని కలచివేసింది.అసలు ఈ ఘటన ఎలా జరిగిందనే దాని విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తూ ఉంది.

అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు కాకముందే ఒడిశాలో మరో రైళ్లు ప్రమాదం సంభవించింది.ఝాజ్‌పూర్‌ రైల్వే స్టేష( Jhajpur railway station )న్ లో ఈ ప్రమాదం సంబంధించినది.

Advertisement

ఆరుగురు రైల్వే కూలీలు మృతి చెందారు.కొంతకాలంగా ఇంజన్ లేని నిరుపయోగంగా ఉన్న గూడ్స్ భోగి కలిగిన రైలుని మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం రావటంతో రైల్వే కార్మికులు( Railway workers ) భోగి కిందకు వెళ్లడం జరిగింది.

అయితే ఈదురు గాలులకి భోగిలో ముందుకి కదలడంతో రైల్వే కూలీలు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు