మరో ఛాన్స్ కొట్టేసిన దుల్కర్ సల్మాన్... ఆ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్!

మహానటి సినిమా ( Mahanati movie )ద్వారా తెలుగులో నటించిన నటుడు దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం ( Sitaramam ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

మలయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన తెలుగులో కేవలం ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈయనకు తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని భావించారు.

ఇలా అనుకున్న విధంగానే ఈయన మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం అందుకున్నట్టు తెలుస్తుంది.కోలీవుడ్ హీరో ధనుష్ ఇటీవల నటించిన చిత్రం సార్( Sir ) ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్న మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి( Venkey Atluri ) ఒక కథను దుల్కర్ సల్మాన్ కు చెప్పడంతో కథ నచ్చిన దుల్కర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ఇలా ఈయన తన తదుపరి చిత్రాన్ని వెంకి అట్లూరి దర్శకత్వంలో చేయబోతున్నారని సమాచారం.

Advertisement

వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ( Nagavamshi ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తుంది.త్వరలోనే ఈ విషయం గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించనునట్లు సమాచారం.ఇక ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మలయాళంలో కింగ్‌ ఆఫ్‌ కొత అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాని స్వయంగా తన బ్యానర్ లో నిర్మించారు.ఈ సినిమా విడుదల అనంతరం వెంకీ అట్లూరి సినిమా పనులు ప్రారంభం అవుతుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు