ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు అయింది.

శ్రీరామనవమి వేడుకలలో భాగంగా నిర్వహించిన శోభాయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎస్ఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు.

ఎస్ఐ ఫిర్యాదు మేరకు షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు.ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు.

తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు.కానీ వరుసగా కేసులు మాత్రం పెడుతూనే ఉన్నారని వాపోయారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు