కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ( Former CM KCR )సోదరుడి కుమారుడు కల్వకుంట్ల కన్నారావుపై( Kalvakuntla Kanna Rao ) మరో కేసు నమోదైంది.

ఈ మేరకు కన్నారావుపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసు నమోదు చేశారు.

ల్యాండ్ సెటిల్ మెంట్( Land Settlement )కోసం ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి కన్నారావు వద్దకు వెళ్లారు.అయితే ఉద్యోగి విజయ్ వర్థన్ ( Vijay Varthan ) వద్ద నగలు, నగదు ఉన్నాయని తెలుసుకున్న తరువాత ఇంటిలో చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

గెస్ట్ హౌస్ లో నిర్బంధించి దాడికి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.కాగా మొత్తం రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నారని సమాచారం.ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కన్నారావు సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?
Advertisement

తాజా వార్తలు