చంద్రబాబుపై మరో కేసు నమోదు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది.టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు అయిందని తెలుస్తోంది.

ఈ మేరకు ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది.కేసులో ఏ1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని, ఏ4గా దేవినేని ఉమను పేర్కొంది.

ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని ఏపీఎండీసీ తన ఫిర్యాదులో ఆరోపించింది.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ రావడంతో చంద్రబాబు ఇటీవలే జైలు నుంచి విడుదల అయిన సంగతి తెలిసిందే.

ఆయనపై ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం కేసు వంటి పలు కేసులు నమోదు కాగా.తాజాగా ఇసుక అక్రమాలపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది.

Advertisement
Bet Plays Mobile App And Mobile Experience : A Practical Guide For Canadian Players