డబ్బు పెట్టి కొన్నావా? విశాల్‌ నీకు సూట్ కాడు అని ట్రోల్!...అనిషా కౌంటర్ హైలైట్.!

విశాల్ పెళ్లి గురించి గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు అందరికి తెలిసిందే.

అనీషాతో విశాల్‌ వివాహం చేయబోతున్నామని ఇటీవల ఆయన తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ప్రకటించారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ బిజినెస్‌మేన్‌ కూతురు అనిషా.ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్.

కొంచెం ప్రేమించుకుంటే, పెద్దలు పూర్తిగా ఒప్పుకున్నారన్నమాట.వచ్చే నెలలో విశాల్-అనీషా పెళ్లి జరగబోతోంది.

ఇంతకుముందు విశాల్ ప్రకటించినట్టుగానే చెన్నైలోని నడిగర్ సంఘం కొత్త బిల్డింగ్ లో విశాల్-అనీషాల పెళ్లి జరగబోతోంది.సంక్రాంతి పండగ రోజున తమ వివాహ బంధానికి సంబంధించిన ప్రకటన చేశారు అనీషా.

Advertisement

అర్జున్‌ రెడ్డి, పెళ్లి చూపులు వంటి చిత్రాల్లో నటించారు.అర్జున్‌ రెడ్డిలో ఆమె కీర్తి పాత్రని పోషించారు.

ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది.ఈ సందర్భంగా విశాల్‌పై తనకున్న ఇష్టాన్ని, నమ్మకాన్ని కూడా ఆమె వెల్లడించారు.

ఈ వార్తపై కొందరు అభినందనలు తెలుపుగా.మరికొందరు మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు.నీవు డబ్బుతో ఎలాంటి బిచ్చగాడినైనా కొనుకోవచ్చు.

విశాల్‌ను వదిలేసేయ్.అలాంటి హీరోను డబ్బు ఆశజూపి పెళ్లి చేసుకోవడం సిగ్గులేదా అని దారుణంగా ట్రోల్ చేశాడు ఓ నెటిజెన్.

How Modern Technology Shapes The IGaming Experience
కాలేయాన్ని శుభ్రం చేసే డ్రైడ్ పపాయ..ఎలా తీసుకోవాలంటే?

ఈ అసభ్యకరమైన కామెంట్స్ పై అనిషా స్పందించారు.డబ్బు కోసం నా ప్రేమలో పడ్డారని నువ్వు అనుకోవడం దారుణం.

Advertisement

విశాల్‌పై దారుణంగా కామెంట్స్ చేయడం చూస్తే నీకు ఆయనపై గౌరవం లేదు.జీవితంపై కొన్నిసార్లైనా నమ్మకం పెంచుకో.

మా బంధం చిరకాలం సాగుతుంది.నీవు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకో అని అనిషా అన్నారు.

అనిషాపై దారుణమైన కామెంట్లు చేయడంతో కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు.ఇలాంటి కామెంట్లు వస్తాయని ఊహించలేదు.విశాల్‌కు సమస్య లేనప్పుడే నీ బాధ ఏంటి? ఒకరిని మరొకరు ఇష్టపడ్డి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు.నీకు అలాంటి కామెంట్లు చేయడానికి నీకున్న అర్హత ఏంటి అని ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు.

తాజా వార్తలు