Anil Ravipudi : అనిల్ రావిపూడి కి ఆ విషయం లో నాగార్జున సపోర్ట్ లేకపోతే డైరెక్టర్ అయ్యేవాడు కాదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ తనను తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

ఇక అందులో భాగంగానే నాగార్జున స్టార్ హీరో అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు.ఇక యువ సామ్రాట్ నాగార్జున గా తనకంటూ ఒక మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఈయన వి ఎన్ ఆదిత్య( V N Aditya ) దర్శకత్వంలో చేసిన బాస్ సినిమా( Boss ) సమయం లో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి ని నాగార్జున చాలా ఎంకరేజ్ చేశాడు.

అలాగే ఆయన చేసిన సీన్లను వింటూ డైలాగులను చెబుతూ చాలావరకు ఎంకరేజ్ చేస్తూ ఆయన స్క్రిప్ట్ రైటర్ గా ఎదగడానికి చాలా ప్రయత్నం చేస్తాడు.ఇక అందులో భాగంగానే ఆ తర్వాత కూడా అనిల్ రావిపూడి చాలా సినిమాలకి రైటర్ గా వ్యవహరించి, ఆ తర్వాత పటాస్ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.ఇక ఈ సినిమా అందించిన సక్సెస్ తో ఇప్పటివరకు ఫెయిల్యూర్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Advertisement

ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున ఎంకరేజ్ చేయడం వల్లే తను ఈ స్థాయికి వచ్చినట్టుగా అనిల్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

మొత్తానికైతే అనిల్ రావిపూడి సినిమా కెరియర్ అనేది స్టార్ రేంజ్ లో దూసుకుపోతుందనే చెప్పాలి.ఇక ఇప్పుడు వెంకటేష్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా హిట్ అయితే అటు వెంకటేష్ కి, ఇటు అనిల్ కి మంచి క్రేజ్ వస్తుందనే చెప్పాలి.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు