అనిల్ మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ మెగాస్టార్ ను లైన్లో పెట్టాడా?

టాలీవుడ్ లో అనిల్ రావిపూడి ( Anil Ravipudi )సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈయన తీసిన సినిమాలన్నీ హిట్ అనిపించుకున్నాయి కానీ ప్లాప్ అవ్వలేదు.

దీంతో స్టార్ డైరెక్టర్ల సరసన ఈయన పేరు కూడా చేరిపోయింది.దీంతో స్టార్ హీరోలని ఎంచుకుంటూ అనిల్ ముందుకు వెళుతున్నాడు.

ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో ఈయన పని చేసాడు.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో కూడా సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ప్రస్తుతం ఈయన భగవంత్ కేసరి సినిమాను ( Bhagavanth Kesari )రిలీజ్ కు సిద్ధం చేసారు.నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ భగవంత్ కేసరి.

Advertisement

ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంత ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇక దసరా బరిలో ఈ సినిమాతో ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.

ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

ఇక తాజాగా ఈ సినిమా తర్వాత కూడా అనిల్ మాస్టర్( Anil Ravipudi ) ప్లాన్ వేసుకున్నట్టు టాక్ వస్తుంది.బాలయ్యతో మంచి హిట్ అందుకుని నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )తో చేయాలని ఫిక్స్ అయ్యారట.ఇప్పటికే మెగాస్టార్ తో చర్చలు జరిపారని తెలుస్తుంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

మరి చిరు కూడా అనిల్ కథ నచ్చితే తప్పకుండ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.ఈయన దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమాకు కమిట్ కాగా ఇదే కాంబో లోనే అనిల్, చిరు సినిమా తెరకెక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

చూడాలి అనిల్ ప్లాన్ ఏంటో.ఎలా ముందుకు వెళతాడా?.

తాజా వార్తలు