టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి మనందరికీ తెలిసిందే.తెలుగు సినీ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా రాణిస్తున్నారు అనిల్ రావిపూడి.
మొదట పటాస్ సినిమాలో జర్నీని మొదలుపెట్టిన అనిల్ ఆ తర్వాత వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు వరుస విజయాలతో దూసుకుపోతూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే అనిల్ రావిపూడి తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ఎఫ్ 3.ఈ సినిమాతో మొదటిసారిగా అనిల్ రావిపూడి దర్శకుడు తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది.అనిల్ రావిపూడి తన ప్రతి సినిమాలో కూడా అతని మునుపటి సినిమా హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ డాన్స్ చేయించడం లేకపోతే స్పెషల్ అప్పిరియన్స్ ఇప్పించడమో చేస్తూ ఉంటాడు.
లేకపోతే ముందు సినిమా హీరోయిన్ తోనే మరొక సినిమాను కంటిన్యూ చేస్తూ ఉంటారు.ఇప్పటికే అనిల్ దర్శకత్వం వహించిన పలు సినిమాలలో ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ వచ్చిన విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా దర్శకత్వం వహించిన ఎఫ్ 3 సినిమా సెంటిమెంట్ విషయానికి వస్తే ఇందులో హీరోయిన్ రష్మికతో ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయించాలి.
కానీ అనిల్ రావిపూడి ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ రష్మికకు బదులుగా పూజా హెగ్డేతో స్పెషల్ సాంగ్ చేయించారు.గత సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిసిన హీరోయిన్ తమన్నా ఇందులో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ విధంగా చూసుకున్నా కూడా అనిల్ రావిపూడి మాత్రం తన సెంటిమెంటును కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు.
మరి ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా విషయం తెలిసిందే.అందులో తమన్నా, మెహరీన్, సోనాలి చౌహాన్ లేదా పూజా హెగ్డే లలో ఎవరో ఒకరిని భాగం చేస్తారేమో చూడాలి మరి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy