బుల్లితెర యాంకర్ గా, వెండితెర రంగమ్మత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ (Anasuya) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.
బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెరకు దూరమవుతూ వెండితెరకు దగ్గరయ్యారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.అయితే కొన్నిసార్లు ఈమె సోషల్ మీడియాలో చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి.
ఇలా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇదివరకు ఎన్నో సార్లు వివాదాలలో నిలిచిన అనసూయ తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును చేశారు అయితే ఈసారి ఒక ఎయిర్ లైన్ సమస్థ పై ఈమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.సాధారణంగా సెలబ్రిటీలు షూటింగ్ పనుల నిమిత్తం పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తుంటారు అయితే వారికి అసౌకర్యంగా కలిగినప్పుడు ఇలా వారి అసౌకర్యాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మండిపడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే అనసూయ ఇండిగో ఎయిర్లైన్స్(Indigo air Lines) పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థను తాను ద్వేషిస్తున్నానని, ఇక్కడ దేశీయ ఎయిర్లైన్స్ వారు ఆధిపత్యం చెలాయించడం ఎంతో విషాదకరమని తెలిపారు.అసలు నాణ్యతలేని సేవలను అందిస్తున్నారు అంటూ ఈమె అసహనం వ్యక్తం చేశారు.ఇలా ఎయిర్ లైన్స్ పై ఈమె అసహనం వ్యక్తం చేసిన అందుకు గల కారణాన్ని మాత్రం అనసూయ వివరించలేదు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఈమె చేసినటువంటి ఈ పోస్టుపై ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy