ఇక రేవంతే టి. కాంగ్రెస్ కు హై కమాండ్ ! ఢిల్లీకి వెళ్లినా నో యూజ్ 

ఏది ఏమైతేనేం.కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు తెలంగాణ కాంగ్రెస్( Congress ) పై ఉన్న చింత తీరిపోయింది .

ఎప్పుడూ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతూ,  తరచుగా ఢిల్లీకి తెలంగాణ సీనియర్ నాయకులంతా క్యూ కడుతూ ఉండేవారు.దీంతో ఈ గ్రూపు రాజకీయాలను సర్దుబాటు చేయలేక అదిష్టానానికి కూడా తలనొప్పులు వచ్చి పడుతూ ఉండేవి.

అయితే రేవంత్ రెడ్డికి( Revanth Reddy ) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా రేవంత్ రెడ్డి చేసిన కృషి,  పార్టీ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ కావడంతో,  తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ కే బాధ్యతలు అప్పగించారు.

And Revante T. Congress High Command No Use Even If You Go To Delhi, Revanth Re

సీనియర్ నేతలు ఎంతోమంది సీఎం రేసులో ఉన్నా,  రేవంత్ వైపే అధిష్టానం పెద్దలు మొగ్గు చూపించారు.ఇక రేవంత్ తన మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి ? ఎవరికి ఏ ఏ పదవులు ఇవ్వాలనే విషయంలోనూ హై కమాండ్ రేవంత్ రెడ్డి నిర్ణయానికే వదిలివేయడం , వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోను ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను రేవంత్ కి అప్పగించడంతో , రేవంత్ పలుకుబడి మరింతగా పెరిగిపోయింది.వివిధ పదవులు , త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణ లో తమకు అవకాశం ఇవ్వాలని పార్టీకి చెందిన సీనియర్ నేతలు అనేకమంది ఢిల్లీకి( Delhi ) వెళ్లి హై కమాండ్ పై ఒత్తిడి చేస్తూ రేవంత్ వద్ద తేల్చుకోవాలని హై కమాండ్ పెద్దలు చెప్పి పంపించేస్తున్నారట.

Advertisement
And Revante T. Congress High Command! No Use Even If You Go To Delhi, Revanth Re

ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అనేక అంశాలపై అధిష్టానం పెద్దలను కలిశారు.  క్యాబినెట్ విస్తరణ , ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక,  నామినేటెడ్ పదవులపై చర్చించారు.

మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరిని తీసుకోవాలి , ఎమ్మెల్సీల ఎంపిక తదితర అంశాల పైన హై కమాండ్ పెద్దలతో రేవంత్ చర్చించగా,  ఈ విషయాల్లో అధిష్టానం నుంచి ఎటువంటి ఒత్తిడి ఉండదని, ఎవరిని ఎంపిక చేసుకోవాలో మీరే తేల్చుకోవాలి అని అధిష్టానం పెద్దలు క్లారిటీ ఇచ్చారట.

And Revante T. Congress High Command No Use Even If You Go To Delhi, Revanth Re

దీంతో ఇకపై తెలంగాణ ప్రభుత్వంలో భర్తీ చేయబోయే పదవులు, నాయకులకు ప్రాధాన్యత తదితర అంశాలపై రేవంత్ రెడ్డి కీలకం కాబోతున్నారు.అధిష్టానం పెద్దల సైతం పూర్తిగా అన్ని విషయాలు రేవంత్ రెడ్డినే డీల్ చేయాల్సిందిగా సూచించడంతో ఇకపై అధిష్టానం పై ఒత్తిడి చేసేందుకు ఎవరు ఢిల్లీకి వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అనే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాంగ్రెస్ పెద్దలను ఢిల్లీ వెళ్లి కలిశారు .అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections ) ఓటమి చెందిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్,  ఫిరోజ్ ఖాన్ లు మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తూ ఢిల్లీ స్థాయిలో లానియింగ్ చేస్తున్న ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని,  రేవంత్ రెడ్డి వద్దే తేల్చుకోవాలి  అని అధిష్టానం సూచించడంతో ఇకపై రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి హై కమాండ్ అనే విషయం అందరికీ అర్థమవుతోంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు