కొత్త ఇల్లే.. యాంకర్ సుమ పాలిట శాపంగా మారిందా ?

యాంకర్ సుమ.ప్రస్తుతం ఈమె గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి.

ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ.కేవలం బుల్లితెరపై కార్యక్రమాలు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్లకు కూడా సుమ యాంకరింగ్ చేస్తూ ఉంటుంది అని చెప్పాలి.ఇక పెద్ద సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకూ ప్రతి సినిమా ఫంక్షన్ లో ఎక్కడ చూసినా సుమ దర్శనమిస్తూ వుంటుంది.

జయమ్మ పంచాయతీ అనే సినిమాతో ఇటీవలే నటిగా తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంది.ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇటీవలే ఈ దంపతులు ఇద్దరూ కలిసి ఓ ఇంటిని ఎంతో ప్రేమగా నిర్మించుకున్నారు.ఈ ఇళ్ళు ఎంతో లగ్జరీగా ఉండడంతో సినిమా షూటింగులు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి.కొత్త ఇంట్లోకి అడుగు పెట్టే ముందు అటు సుమ, రాజీవ్ కనకాల దంపతులకు కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది.2018 లో ఉన్న ఇంటి నిర్మాణం పూర్తయింది.గృహ ప్రవేశం చేయాలి అనుకుంటున్న సమయంలో రాజీవ్ కనకాల తల్లి అనారోగ్యంతో మరణించారు.

Anchor Suma Struggles With New Home , Anchor Suma, Rajeev , Kanakala Suma, Devad
Advertisement
Anchor Suma Struggles With New Home , Anchor Suma, Rajeev , Kanakala Suma, Devad

దాంతో గృహప్రవేశం కార్యక్రమాన్ని విరమించుకున్నారు.ఆ తర్వాత 2019లో ఇంట్లో అడుగు పెట్టాలని అనుకున్నారట ఈ దంపతులు.ఆ సమయంలో రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల అనారోగ్యం కారణంగా మృతి చెందారు.

దీంతో ఇక రాజీవ్ కనకాల సుమ కూడా ఇద్దరూ విషాదంలో మునిగిపోయారు.కొంత కాలానికి రాజీవ్ కనకాల సోదరి క్యాన్సర్ తో కన్నుమూసింది.దీంతో ఇవన్నీ చూసి గృహప్రవేశం పెట్టుకోవాలి అనుకున్న సమయంలో ఏదో ఒక విషాదం జరుగుతుంది దీని బట్టి ఇంట్లో వాస్తు లోపం ఉందా అందుకే వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయా అని ఆందోళనలో పడ్డారట.

కానీ ఎట్టకేలకు ఒక మంచి ముహూర్తం చూసుకుని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు ఈ దంపతులు.అయితే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చే చెత్త రూమర్స్ అంటూ కొంత మంది వాదిస్తున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు