పెద్దగా కలిసి రావడం లేదు... ఒక్క మాటతో రిటైర్మెంట్ గురించి ప్రకటించిన సుమ?

యాంకర్ సుమ(Suma) తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు తెలుగు బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇంటర్వ్యూలు అంటూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సుమ తాజాగా నిట్ ఇంజనీరింగ్ ఫెస్ట్ లో పాల్గొని సరదాగా విద్యార్థులతో ముచ్చటించారు.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరీర్ గురించి పలు విషయాలను తెలియజేశారు.సుమ కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్(Serials) లో సందడి చేసిన విషయం మనకు తెలిసింది.

అలాగే యాంకర్ గా స్థిరపడ్డారు అనంతరం వెండి తెరపై పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె జయమ్మ పంచాయతీ(Jayamma Panchayathi) అనే సినిమా ద్వారా ప్రధాన పాత్రలో నటించి సందడి చేశారు.అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

దీంతో ఈమె తదుపరి సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదని ఈ సందర్భంగా ఈమె చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ తనకు యాంకరింగ్ అంటేనే ఇష్టం అని యాక్టింగ్ వద్దులే మనకు పెద్దగా కలిసి రావడం లేదని చెప్పుకొచ్చారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా తనకు బిగ్ స్క్రీన్ పై నటించడం ఏమాత్రం ఇష్టం లేదు అంటూ ఈ ఒక్క మాటతోనే తాను సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పకనే చెప్పేశారు.

Advertisement

ఇలా వెండితెరపై తనకు పెద్దగా కలిసి రాకపోవడంతో ఈమె బుల్లితెరపైనే కొనసాగాలనీ నిర్ణయించుకున్నారంటూ సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.సుమ బిగ్ స్క్రీన్ పై సందడి చేయలేకపోయినా తన కుమారుడిని ( Anchor Suma Son ) మాత్రం హీరోగా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు