Anchor Shyamala: కట్టుకున్నోడికి విలువ ఇవ్వట్లేని యాంకర్ శ్యామల… ఫైరవుతున్న నెటిజన్స్?

ఎంత మంచి హోదాలో ఉన్న సరే కట్టుకున్న వారిని గౌరవించాలి.లేదంటే సమాజంలో వారికి విలువ ఉండదు.

నిజానికి చెప్పాలంటే ఈ మధ్య కొంతమంది సామాన్య ప్రజలే కట్టుకున్న వాళ్లకు విలువ ఇవ్వట్లేదు.ఒక హోదాలో ఉన్న వాళ్ళు ఏమిస్తారు.

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వాళ్ళు పెళ్లి అయినా కానట్లే ఉంటారు.

పది మందిలో అందంగా కనిపించడం కోసం పెళ్లి కానట్లే నటిస్తారు.ఇప్పటికీ చాలామంది హీరోయిన్ పెళ్లిళ్లు చేసుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

Advertisement

ఇక పెళ్లిలు అయినప్పటికీ కూడా మెడలో తాళిబొట్టు, నుదుటన బొట్టు అనేవి కనిపించవు.కారణం ఏంటంటే పదిమందిలో అందంగా కనిపించడానికి అవన్నీ తీసేస్తారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు సాంప్రదాయానికి చెందిన సెలబ్రిటీలు( Celebrities ) సైతం అలాగే తయారవుతున్నారు.

మంచి సంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా.మెడలో తాళిబొట్టును తీసేస్తున్నారు.పెళ్లయిన ఆడదానిగా భర్తకు ( Husband ) విలువ ఇవ్వకుండా సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు.

దీంతో వీరిని అలా చూసినప్పుడు చూసే జనాలు వెంటనే వారిపై ఏకీపారేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఇటువంటిదే యాంకర్ శ్యామలకు( Anchor Shyamala ) కూడా ఎదురయింది.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?

యాంకర్ శ్యామల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.యాంకర్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Advertisement

అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో యాంకర్ గా, నటిగా కొనసాగుతూనే ఉంది.

ఇక ఈమెకు పెళ్లవ్వగా ఒక కొడుకు కూడా ఉన్నాడు.తన భర్త కూడా ఇండస్ట్రీకి చెందిన నటుడే.

ఇక కెరీర్ మొదట్లో అడుగుపెట్టిన శ్యామలకు.ఇప్పుడున్న శ్యామలకు చాలా మార్పు వచ్చింది అని చెప్పాలి.ముఖ్యంగా తన గెటప్ విషయంలో చాలా మార్పు వచ్చింది.

అప్పటికీ.ఇప్పటికీ.

యాంకర్ గానే కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రతిసారి ఈమెలో కొత్త కొత్త యాంగిల్ బయట పడుతూ వచ్చింది.ఇక ఈ మధ్య తోటి యాంకర్లను చూసి ఈమె కూడా అందాల ఆరబోత చేయడం మొదలుపెట్టింది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, తన ప్రాజెక్ట్ అప్డేట్ల గురించి కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది.

ఇక బాగా వర్కౌట్లు చేసి మంచి ఫిజిక్ కూడా సొంతం చేసుకుంది.ఇక అప్పటినుంచి మరింత అందాల ఆరబోత చేస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంది.అందులో తను ట్రెడిషనల్ లుక్ లో ఉండగా కెమెరాకు ఫోజులిచ్చింది.అయితే ఆమె మెడలో తాళిబొట్టు లేకపోవడంతో కొందరు జనాలు ఆమెపై బాగా దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇక ఓ నెటిజన్.యాంకర్స్ మరీ ఘోరంగా తయారవుతున్నారు.

తాళిబొట్టు కూడా తీసేసి ప్రోగ్రాం చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.ఇక మరి కొంతమంది.

మంచి సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చినప్పటికీ కూడా కట్టుకున్నోడికి విలువ ఇవ్వకుంటే ఎలా అంటూ ఫైర్ అవుతున్నారు.

తాజా వార్తలు