రవి నోటి దూల... అవార్డు వద్దని వెళ్లిపోయిన యాంకర్... అసలేమైందంటే?

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు సీరియల్స్ ప్రసారమవుతు పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే బుల్లితెర చానల్స్ కూడా వివిధ రకాల అవార్డుల వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే బుల్లితెర ఛానల్ అయినటువంటి జీ తెలుగు సైతం ఈసారి ఫెంటాస్టిక్ అవార్డ్స్ పేరిట బుల్లితెర నటీనటులకు పలు కేటగిరీలలో అవార్డులను అందించారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్రసారం కానుంది.

ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ రవి అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి యాంకర్లుగా వ్యవహరించారు.ఇక తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు.

ఫెంటాస్టిక్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఇందులో ప్రధానం చేసే అవార్డుల పేర్లను కూడా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు.ఇక బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అకుల్ బాలాజీ గురించి అందరికీ సుపరిచితమే.

Advertisement
Anchor Ravi Shocking Comments On Akul Balaji Details, Ravi, Anchor Ravi ,shockin

ఈయన సీరియల్స్ లో నటించడమే కాకుండా పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

Anchor Ravi Shocking Comments On Akul Balaji Details, Ravi, Anchor Ravi ,shockin

ఇక ఫెంటాస్టిక్ అవార్డ్స్ కార్యక్రమాలలో భాగంగా అకుల్ బాలాజీకి ఉత్తమ యాంకర్ గా అవార్డు వచ్చింది.అయితే యాంకర్ రవి బెస్ట్ యాంకర్ అవార్డు తీసుకోవడానికి అకుల్ రావాల్సిందిగా కోరుతూ.వాగుడు వీరయ్య అని సంబోధించాడు.

ఇలా ఒక యాంకర్ ను పట్టుకొని వాగుడు వీరయ్య అనడం ఏమాత్రం బాగాలేదని.ఇలా అనడం కరెక్ట్ కాదని అకుల్ అవార్డు అందుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ప్రోమోలో భాగంగా ఇలా చేశారా.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

లేదా నిజంగానే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారనేది తెలియాలంటే ఆదివారం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం వరకు వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు