ప్లీజ్ సార్ అంటూ నాగార్జునను రిక్వెస్ట్ చేస్తున్న జబర్దస్త్ యాంకర్... ఏమైందంటే?

ఈటీవీలో ప్రసారమవుతున్న బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రష్మీ( Rashmi ) ఒకరు.

ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న రష్మీ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి( Jabardasth ) యాంకర్ గా మారారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

వచ్చిరాని తెలుగులో ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఎంతోమందిని ఆకట్టుకున్న ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

Anchor Rashmi Special Request To Nagarjuna For Yuva Serial Reunion Details, Rash

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా రష్మీ కేవలం బుల్లితెర యాంకర్ గా మాత్రమే కాదు.గతంలో పలు సినిమాలలో కూడా నటించారు.అయితే గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో యువ సీరియల్ కి( Yuva Serial ) సంబంధించి కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇందులో భాగంగా రష్మీ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ యువ సీరియల్ నాగార్జున( Nagarjuna ) అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నిర్మించారు.

Anchor Rashmi Special Request To Nagarjuna For Yuva Serial Reunion Details, Rash
Advertisement
Anchor Rashmi Special Request To Nagarjuna For Yuva Serial Reunion Details, Rash

ఈ క్రమంలోనే ప్రస్తుతం యువ సీరియల్ పెద్ద ఎత్తున పాపులర్ అయిన నేపథ్యంలో రష్మీ సోషల్ మీడియా వేదికగా నాగార్జునను ఒక రిక్వెస్ట్ చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.యువ సీరియల్ రీ యూనియన్ ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది.అంటూ నాగార్జునకు రిక్వెస్ట్ పెట్టింది రష్మీ గౌతమ్.

మరి ఈమె చేసిన ఈ రిక్వెస్ట్ ను నాగార్జున యాక్సెప్ట్ చేస్తూ యువ సీరియల్ రీ యూనియన్ ఎపిసోడ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ వీడియో చూసిన వారందరూ కూడా రష్మీ గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

రష్మీ అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం మారడం లేదు అంటూ కూడా పలువురు కామెంట్లు చేస్తున్నారు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు