Anchor Rashmi Gautam : రష్మీ, అనసూయలపై ఇప్పుడు కామెంట్ చేస్తే.. జైలుకు పోవాల్సిందే!

సోషల్ మీడియా( Social Media )లో ఎక్కువగా ట్రోల్స్ కి గురయ్యే యాంకర్స్ పేర్లు చెప్పమంటే రష్మీ గౌతమ్ అనసూయ పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.

ఈ ఇద్దరు ఫిమేల్ యాంకర్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో నిలవడంతో పాటు ట్రోలింగ్స్ సైతం ఎదుర్కొంటూ ఉంటారు.

డ్రెస్సింగ్, ఫోటో షూట్స్, ట్వీట్స్ పై ట్రోల్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు.అనసూయ ఎక్కువసార్లు రియాక్ట్ అయిన కూడా రష్మీ అలాంటి వాటిని చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటుంది.

కాగా తాజాగా రష్మీ గౌతమ్ కూడా అలా నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంది.ఈ నేపథ్యంలోనే ఆమె పంతా కూడా మార్చుకుంది.

ఒక నెటిజన్ రష్మీ గౌతమ్( Rashmi Gautam ) ని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Advertisement

అంతేకాకుండా ఆ కామెంట్ కి ఆమెను ట్యాగ్ చేశాడు.హైపర్ ఆదితో రష్మీ గౌతమ్ వైల్డ్ రొమాన్స్ చేస్తుంది.సుడిగాలి సుధీర్ తో కేవలం టీఆర్పీ( TRP ) కోసం.

నిజానికి రష్మీ ఆదిని ఎంతగానో ఇష్టపడుతుంది.అని కామెంట్ పెట్టి రష్మీని ట్యాగ్ చేశాడు.

ఇంస్టాగ్రామ్ పోస్ట్( Instagram Post ) మీద రష్మీ గౌతమ్ మండిపడింది.గతంలో ఇటువంటి వేధింపులు సహించాను, చూసి చూడనట్టు వదిలేశాను.

నా మీద ఆరోపణలు చేయడమే కాకుండా నన్ను ట్యాగ్ చేసేంత ధైర్యం చేశావంటే.ఇక ఉపేక్షించేది లేదు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

దీనికి నువ్వు అనుభవిస్తావు అని కామెంట్ పెట్టింది.దాంతో భయపడిన నెటిజన్ వెంటనే కాళ్ళ బేరానికి వచ్చాడు.

Advertisement

ఇకపై చేయను మేడమ్.నన్ను క్షమించండి.

నాకు ఫ్యామిలీ ఉంది.ఈ ఒక్కసారికి మన్నించండి.

అని దండం పెట్టి వేడుకున్నాడు.అయినా కూడా వదిలేది లేదు.

నువ్వు ఈ క్షమాపణ సైబర్ క్రైమ్ పోలీసుల( Cybercrime Police ) ముందు చెప్పుకో అంటూ రష్మీ వార్నింగ్ ఇచ్చింది.సదరు నెటిజన్ రష్మీని బ్రతిలాడుతూ ఇంస్టాగ్రామ్ చాట్ చేశాడు.ఆ చాట్ హిస్టరీ స్క్రీన్ షాట్ తీసిన రష్మీ గౌతమ్.

పోస్ట్ చేశారు.అలాగే ఈ వ్యక్తి మీద నేను చర్యలు తీసుకోవాలా వద్దా.

అని ఒక పోల్ కూడా పెట్టింది.ఆమె ప్రశ్నకు నెటిజెన్స్ స్పందిస్తున్నారు.

కొందరు ఈసారికి వదిలేయండి రష్మీ గారు అని కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు మాత్రం ఇలాంటి వాళ్ళను వదలకూడదు.సరైన బుద్ధి చెప్పండి అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.

కాగా కదా మొన్నటికి మొన్న వీధి కుక్కలు దాడిలో బాలుడు మరణించడంతో రష్మీ ఇందులో తప్పు ఉంది అంటూ కొందరరు నెటిజన్స్ ఆమెను దూషించిన తెలిసిందే.ఇలాగే వదిలిపెడితే వీళ్ళు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తారని అనసూయ రష్మీ ఇద్దరు గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనసూయ, రష్మీ ట్రోలర్స్( Trollers ) మీద కత్తికట్టినట్లు ఉన్నారు.హద్దులు దాటి ప్రవర్తిస్తే జైలు పాలే అని హెచ్చరిస్తున్నారు.

అనసూయ ఇప్పటికే చాలా మందిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపింది.ఆమెకు రష్మీ కూడా తోడైంది.

కాబట్టి సెలెబ్రిటీల మీద కామెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే బెటర్.

తాజా వార్తలు