వీడేంటీ ఇలా ఉన్నాడు అనుకున్నారు... మహేష్ బాబు పై యాంకర్ ప్రదీప్ కామెంట్స్ వైరల్! 

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు( Anchor Pradeep Machiraju ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బుల్లితెరపై ఎన్నో షోలకు ఎన్నో ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించి మేల్ యాంకర్స్ లో స్టార్ యాంకర్ గా నెంబర్ వన్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్.

ఇటీవల కాలంలో బుల్లితెరపై యాంకర్ గా తక్కువగా కనిపిస్తున్న ప్రదీప్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా మారిన విషయం తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ గా నిలిచింది.ఇకపోతే ప్రదీప్ తాజాగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.( Akkada Ammayi Ikkada Abbayi )

Anchor Pradeep Sensational Comments On Super Star Mahesh Babu Details, Mahesh Ba

జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి( Deepika Pilli ) ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.నితిన్, భరత్ కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ లో జోరు పెంచిన చిత్ర బృంద.

Advertisement
Anchor Pradeep Sensational Comments On Super Star Mahesh Babu Details, Mahesh Ba

కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇటీవల ట్రైలర్‌ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు నాలుగో పాట ప్రియమర 05-04-2025 రాబోతున్నట్లు అనౌన్స్ చేసి ఒక బ్యూటిఫుల్ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు.

ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుపై( Mahesh Babu ) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Anchor Pradeep Sensational Comments On Super Star Mahesh Babu Details, Mahesh Ba

మహేశ్ గారిని నేను ఎప్పుడు పర్శనల్‌ గా కలవలేదు.దూరం నుంచే చూశాను.ఒకసారి నా టాక్ షోకు ఆయన వచ్చారు.

ఒక హోటల్‌ లో చిన్న టీవీ సెట్‌ లా వేసి అక్కడే షూట్ చేశాము.అదే ఫస్ట్ నేను ఆయనతో డైరెక్ట్‌ గా మాట్లాడటం.

ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో పొరపాటు చేశారా.. అసలేం జరిగిందంటే?
సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదేనా..?

అప్పుడు ఆయన నన్ను ఎలా చూశారంటే ఒక వింజ జంతువును చూసినట్టు ఏంటీ ఇలా ఉన్నాడు వీడు అన్నట్లు చూశారు.ఇక కొంచెం సేపు చేసిన తర్వాత మహేశ్ బాబు వాళ్ల టీమ్ వాళ్లు వచ్చి చాలు ఇక ఆపేయ్ అన్నట్లు నాకు సైగా చేశారు.

Advertisement

అప్పుడు మహేశ్ ఏంటీ మా వాళ్లు ఆపేయ్ అంటున్నారా.పర్వాలేదులే నువ్వు ఏమి అనుకుంటున్నావో అన్నీ అడుగు అంటూ చెప్పారు.

ఆ తర్వాత మహేశ్ బాబు ఏ ఈవెంట్‌ కు వెళ్లిన అక్కడ నేను ఉన్నాన లేదా అని అడిగేవారు.ఒకసారి అయితే అది నా ఈవెంట్ కాకపోయిన సరే నేను ఉండాలని నాకు ఫోన్ చేయించి మరి నన్ను ఫ్లైట్‌ లో తీసుకెళ్లారు.

ఆ క్షణం నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా అనిపించింది అని తెలిపారు ప్రదీప్.ఈ సందర్భంగా ప్రదీప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు