డ్యాన్స్ వీడియో షేర్ చేసిన యాంకర్ లాస్య.. ప్రెగ్నెన్సీ టైమ్ లో అవసరమా అంటూ ట్రోల్స్!

ఒకప్పటి యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఈమె పేరు వినగానే వెంటనే చీమ, ఏనుగు జోక్స్ గుర్తొస్తాయి.

ఈ జోకులతో ప్రేక్షకులను బాగా అలరించింది.బుల్లితెరపై తన మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక కొత్తగా చూసే వారికి యాంకర్ అంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా చేసింది లాస్య.గత కొంత కాలం నుండి లాస్య యాంకర్ గా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

అప్పట్లో యాంకర్ రవి తో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న లాస్య.తన పెళ్లి తర్వాత బిజీ లైఫ్ లో గడుపుతుంది.

Advertisement

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా లాస్య తన జోకులతో, కొన్ని విషయాలతో తెగ ముందుంటుంది.ఈమె బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం.తన పని ఏంటో తానే చూసుకునేది.

ఇతరులను ఎక్కువగా నొప్పించకుండా గేమ్ లో బాగా పాల్గొనేది.అంతేకాకుండా తనకు బిగ్ బాస్ వంటలక్క అనే టైటిల్ ను కూడా ఇచ్చాడు.

హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తన చేతి వంట రుచి చూపించింది.లాస్య బుల్లితెరపై షో లలోనే కాకుండా ఎం యల్ ఏ, రాజ మీరు కేక, స్వాతి ఐ లవ్ యు వంటి చిత్రాలలో వెండి తెరపై నటించి తనదైన నటనను కనబరిచింది.

ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?

అప్పట్లో రవితో రిలేషన్ లో ఉన్నట్టు బాగా వార్తలు వచ్చాయి.కానీ అవన్నీ పుకార్లే అని తర్వాత కు తెలిసాయి.పైగా గతంలో లాస్య యాంకర్ గా దూరం కావడానికి కారణం యాంకర్ రవి నే అని వార్తలు వచ్చాయి.

Advertisement

అలా ఇండస్ట్రీకి దూరంగా ఉండి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మంజునాథ్ చిల్లాలేను పెళ్ళి చేసుకుంది.ఇక లాస్య తన భర్త మంజునాథ్ గురించి, తన ప్రేమ గురించి పలు వేదికల మీద చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

తనకు ఓ బాబు కూడా ఉన్నాడు.ఇక మళ్లీ మరోసారి ప్రెగ్నెంట్ కూడా అయ్యింది.ఈ విషయాన్ని తను ఈ మధ్యనే తెలిపింది.

అంతేకాకుండా ఆమధ్య మళ్లీ బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది లాస్య.పైగా తన భర్త మంజునాథ్ తో కలిసి చాలా షోలో పాల్గొని బాగా సందడి చేసింది.

తను కూడా ఒంటరిగా ఎన్నో షోల్లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.

ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పంచుకుంది.అందులో తను డాన్స్ చేస్తూ కనిపించింది.

అయితే ఆ వీడియోని చూసిన నెటిజన్స్ తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని గుర్తు చేశారు.ఈ సమయంలో కూడా డాన్స్ చేయటం అవసరమా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని కొందరు అంటున్నారు.

తాజా వార్తలు