Anchor Anasuya Bharadwaj :జబర్దస్త్ కి దూరంగా ఉండటానికి కారణం అదే.. అనసూయ భరద్వాజ్ కామెంట్స్ వైరల్?

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్( Anchor Anasuya Bharadwaj ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అనసూయ ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

మొన్నటి వరకు యాంకర్ గా తన సత్తాను చాటుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అనసూయ ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది.అయితే అనసూయ నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంటుండడంతో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ప్రస్తుతం అనసూయ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.

అందులో పుష్ప 2( Pushpa 2 ) భారీ ప్రాజెక్టు అన్న విషయం మనందరికీ తెలిసిందే.కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ గ్లామర్ ఫోటోషూట్స్( Anasuya Glamorous Photoshoots ) చేస్తూ ఉంటుంది అనసూయ.అంతేకాకుండా తరచూ ట్రోల్లింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది.

Advertisement

తనపై నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ట్రోల్స్( Trolls ) చేసే వారికి దిమ్మతిరిగే రేంజ్ లో సమాధానం చెబుతూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే మధ్యకాలంలో అనసూయ షాపింగ్ మాల్స్ జువెలరీ షాప్ ఓపెనింగ్ >లకు వెళ్తున్న విషయం తెలిసిందే.

ఇక అనసూయ వస్తుంది అనగానే అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.అనసూయతో కలిసి ఫోటోలు దిగడానికి ఎగబడుతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ నంద్యాలలో సందడి చేశారు.పట్టణంలోని ఒక షాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవం( Anasuya Nandyal Shopping Mall Opening )లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత ఆమె బయటకు వచ్చి అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై డాన్సులు కూడా చేసింది.

ఆ తర్వాత తన అభిమానులకు హాయ్ చెబుతూ కొంతమందితో సెల్ఫీలు కూడా దిగింది.మనసు ఏదో సెల్ఫీలు దిగడం కోసం అభిమానులు భారీగా పోటీపడ్డారు.అనంతరం అనసూయ షాపింగ్ మాల్ కి వెళ్లి అక్కడే ఉన్న చీరలను చూసి మురిసిపోయారు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఉండగా ఆమెకు జబర్దస్త్( Jabardasth ) కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.ఒకతను జబర్దస్త్ కి ఎందుకు దూరంగా ఉంటున్నారు అని ప్రశ్నించగా.

Advertisement

అనసూయ స్పందిస్తూ.నన్ను బాగా ఇష్టపడేవారు కన్ఫ్యూజ్ అవుతున్నారు.

జబర్దస్త్ లో ఎప్పుడు నవ్వుతూ ఉంటాను కానీ సినిమాలలో కొంచెం సీరియస్ క్యారెక్టర్లు చేస్తున్నాను కదా, కాబట్టి ఆ రెండింటికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనగా ఇంతలోనే మరో అతను మీకు లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ కదా అనగా కచ్చితంగా అని తెలిపింది అనసూయ.

తాజా వార్తలు