విజయవాడలో సందడి చేసిన అనసూయ.. వదలని ట్రోలర్స్?

అనసూయ గత వారం రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.

ఈమె ఎప్పుడైతే విజయ్ దేవరకొండ సినిమాని ఉద్దేశిస్తూ పరోక్ష ట్వీట్ చేశారో అప్పటినుంచి నేటిజనులకు టార్గెట్ అయ్యారు.

ఏకంగా నేటిజన్స్ ఆంటీ అంటూ తనపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ తనని ట్రోల్ చేస్తున్నారు.ఇలా నేటిజనులతో వివాదానికి దిగిన అనసూయ ఏకంగా వారిపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేశారు.

ఇలా ఈమె పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టినప్పటికీ తగ్గేదేలే అంటూ నేటిజన్స్ రెచ్చిపోయి తనని ట్రోల్ చేస్తున్నారు.ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ తనుకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈమె విజయవాడలో సందడి చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలను షేర్ చేస్తూ అనసూయ వివరాలను వెల్లడించకుండా కేవలం విజయవాడ అంటూ ఫోటోలను షేర్ చేశారు.

Advertisement
Anasuya Who Made Noise In Vijayawada Trollers Who Did Not Leave , Anasuya , Vija

అయితే ఈ ఫోటోలను చూస్తుంటే వీరు ఫ్యామిలీ మొత్తం ఏదో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

Anasuya Who Made Noise In Vijayawada Trollers Who Did Not Leave , Anasuya , Vija

ఈ విధంగా పూజా కార్యక్రమాలలో పాల్గొన్న అనసూయ అనంతరం గోశాలను కూడా సందర్శించినట్టు తెలుస్తుంది.ఇలా అనసూయ తమ విజయవాడ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి.అయితే ఇక్కడ కూడా నెటిజన్స్ ఏమాత్రం తగ్గకుండా హ్యాపీ జర్నీ ఆంటీ అంకుల్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

ఎక్కువమంది నెటిజన్స్ ఆంటీ అనే పదంతోనే అనసూయ పై కామెంట్లు చేయడం గమనార్హం.అయితే ఇందులో ఒక నెటిజన్ మాత్రం ఎన్నాళ్లకు మీ మెడలో తాళిబొట్టు చూసాము అంటూ కామెంట్ చేయడం విశేషం.

ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు