బుద్ది చెప్పే టైమ్ వచ్చిందంటూ అనసూయ ట్వీట్.. కాస్త ఓపిక పట్టండంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ మధ్యకాలంలో అనసూయ భరద్వాజ్ ఎక్కువగా వివాదాలలో నిలుస్తోంది.

అయితే ఇటీవలే అనసూయను ఆంటీ అంటూ ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే.ఈ కథలను ఆంటీ అంటూ ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న వారికి అనసూయ తనదైన శైలిలో స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చింది.

అంతే కాకుండా అటువంటి వాళ్లపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది అనసూయ.తాజాగా ఈ కంటెంట్ విషయంపై ఒక నెటిజన్ చేసిన ట్వీట్ కు అనసూయ తగిన విధంగా బుద్ధి చెప్పింది.

తాజాగా కేరళలో ఓనం పండుగ సెలబ్రేషన్స్ సందర్భంగా పండుగ విషెస్ చెబుతూ అనసూయ ట్వీట్ చేసింది.ఈ ట్వీట్ పై స్పందించిన ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ కంప్లైంట్స్ విషయం ఎంతవరకు వచ్చింది అని ప్రశ్నించాడు.

Advertisement

ఆ ట్వీట్ పై స్పందించిన మరొక నెటిజన్ రిప్లై ఇస్తూ నీలా మాకు పని పాట లేదు అనుకుంటున్నావా అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లు చెప్పి పంపించేశారు అని కామెంట్ చేశాడు.ఆ కామెంట్స్ చూసి మండిపడిన అనసూయ మీలా పని పాట లేని వాళ్లకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది అంటూ రిప్లై ఇచ్చింది.

ఈ సందర్భంగా అనసూయ ట్వీట్ చేస్తూ.లేదండి.మీలా పనిపాట లేని వాళ్లకు బుద్ధి చెప్పే టైమ్ వచ్చిందని చెప్పారండి.

మీకు నోరు జారటంలో తొందర ఎలాగూ ఉంది.బోల్తా పడటానికి కూడా తొందరే కదా మీకు.

కాస్త ఓపిక పట్టండి.అన్ని జరుగుతాయి.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

జరుగుతున్నాయి.అంటూ రాసుకొచ్చింది అనసూయ.

Advertisement

ఇంతలోనే మరొక నెటిజన్ ఎవరైనా ఆంటీ లేదా అంకుల్ అని పిలిస్తే ఏ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చుఅంటూ ప్రశ్నించాడు.వెంటనే స్పందించిన అనసూయ ఇంకొక ట్వీట్ చేస్తూ ఇది ఆంటీని పిలిచినందుకు కాదు.

ఆంటీ పేరుతో రౌడీతనం గురించి.నా పని తీరును, నా మానసిక ప్రశాంతతను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర.

శిక్షార్హమైన నేరం.అంటూ అనసూయ మరో ట్వీట్ చేశారు.

తాజా వార్తలు