ఈ ఐడియాకు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా.. మాములుగా లేదుగా..

ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ఎప్పుడూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు.

రోజూ ఎన్నో అంశాలపై స్పందిస్తూ ఉంటారు.

ట్విట్టర్ లో వైరల్ అయ్యే వీడియోలపై ఆయన ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు.వినూత్నమైన ఆవిష్కరణలు, ఐడియాలకు సంబంధించిన వీడియోలను యూజర్లతో పంచుకుంటూ ఉంటారు.

ఈ వీడియోలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు.అందులో భాగంగా తాజాగా ఆనంద్ మహీంద్రా మరో వీడియోను పంచుకున్నారు.

Anand Mahindra Tweet About Water Conservation Technique Details, Anandh Mahindra

నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలనేది చూపించే ఒక వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేశారు.ఈ వీడియోలో రెస్ట్ రూమ్ లోని టాయిలెట్ కు హ్యాండ్ వాష్ సింక్( Hand Wash Sink ) జత చేసి ఉంది.చేతులు కడుక్కోగానే నీళ్లు కిందకు వెళుతున్నాయి.

Advertisement
Anand Mahindra Tweet About Water Conservation Technique Details, Anandh Mahindra

దానిని ప్లష్ కోసం ఉపయోగించుకోవచ్చు.దీని వల్ల నీళ్లు చాలా ఆదా అవుతున్నాయి.

ప్రతీ సంవత్సరం కొన్ని మిలియన్ల నీళ్లు దీని ద్వారా ఆదా అవుతున్నాయి.అందరూ ఈ విధానాన్ని పాటిస్తే చాలా బాగుంటుందని, నీటి కొరత ఉండదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Anand Mahindra Tweet About Water Conservation Technique Details, Anandh Mahindra

ఈ పోస్ట్ లో తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇది చాలా సింపుల్ ఇన్నోవేషన్( Simple Innovation ) అని, చాలా ఉపయోగరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.జనాభా ఎక్కువగా ఉన్న మనం దేశంలో నీటి సమస్య రాకుండా ఉండేందుకు ఇది అమలు చేస్తే చాలా బాగుంటుందని అన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో ఈ వీడియోను ఒక్కసారిగా వైరల్ గా మారింది.

దీనికి నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.ఈ ఆవిష్కరణ చాలా బాగుందని, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని కొంతమంది అంటున్నారు.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..

ఇలాంటి విధానం మన ఇండియాలో రావాలని మరికొందరు అంటున్నారు.చూడటానికి చాలా బాగుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

గుడ్ ఐడియా అని మరికొందరు అంటున్నారు.

తాజా వార్తలు