రష్మిక ఫోన్ కొట్టేసిన ఆనంద్ దేవరకొండ.. ఇది మామూలు వాడకం కాదుగా?

సినీ నటుడు ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) గంగం గణేశా( Gam Gam Ganesha ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా నేడు విడుదలయి ప్రేక్షకులను సందడి చేస్తుంది.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేశారు ఆనంద్ దేవరకొండ.ఇకపోతే ఈయన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరోయిన్ రష్మికను( Rashmika ) ఆహ్వానించి తనదైన సైలిలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రష్మిక సందడి చేసిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా ఆనంద్ దేవరకొండ రష్మిక మధ్య జరిగిన సంభాషణ కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఈ విధంగా రష్మికను ఆనంద్ దేవరకొండ తన సినిమా ప్రమోషన్ల కోసం భారీ స్థాయిలో వాడేస్తున్నారని చెప్పాలి.

ఈ సినిమాలో ఈయన ఒక దొంగ పాత్రలో కనిపిస్తారు.ఈ క్రమంలోనే ఆనంద్ రష్మిక ఫోన్( Rashmika Phone ) దొంగతనం చేసినట్టు రష్మిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

ఇందులో రష్మిక క్యారవాన్ నుంచి ఆనంద దేవరకొండ జబర్దస్త్ కమెడియన్ ఫోన్ దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వస్తూ తన ఫోన్ దొంగతనం చేసినట్లు తెలిపారు.రష్మిక ఫోన్ ఇది.కేరవ్యాన్ నుంచి కొట్టేశాం.ఇప్పుడే సూసేకి అంటూ పాట వచ్చింది.

మా సినిమాని కూడా చూడండి.మేం మీ ఫ్యాన్స్ అంటూ రష్మిక ఫోన్‌లో ఇమాన్యుయేల్, ఆనంద్ దేవరకొండలు రికార్డ్ చేసినట్టుగా వీడియోని షేర్ చేశారు.

ప్రస్తుతం రష్మిక ఈ వీడియోని షేర్ చేస్తూ హే నా ఫోన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసిన అభిమానులు రష్మికను తన సినిమా కోసం మామూలుగా వాడటం లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు