యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ ( Anand Devarakonda )విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్ళు అవుతున్న ఈయనకు బ్రేక్ రాలేదు అనే చెప్పాలి.
అయితే తాజాగా ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమాతో ఎట్టకేలకు ఒక హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya )( హీరోయిన్ గా నటించిన బేబీ మూవీ ( Baby Movie )ముందు నుండి ప్రమోషన్స్ తో భారీ అంచనాలను పెంచుకుంటూ వచ్చింది.ఇక ఈ సినిమాను ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు.కలర్ ఫోటో లాంటి అందమైన సినిమాకు కథ ఇచ్చిన సాయి రాజేష్ ఇప్పుడు లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమాను ప్రేక్షకుల మనసులను హత్తుకునే ప్రేమ కథగా తెరకెక్కించడంలో ఈయన సఫలం అయ్యాడు.నిన్న జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది.
ఇక యూఎస్ లో కూడా ప్రీమియర్స్ నుండే మంచి టాక్ అందుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే రాబట్టినట్టు మేకర్స్ తాజాగా పోస్టర్ ద్వారా తెలిపారు.
ఈ సినిమా యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారా మొదటి రోజే లక్ష డాలర్స్ కు పైగానే రాబట్టగా ఇప్పుడు తాజాగా 150K డాలర్స్ మార్క్ ను క్రాస్ చేసినట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.దీంతో యుఎస్ లో ఈ సినిమా మరింత స్ట్రాంగ్ అవుతూ పోతుంది.ఈ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అంటున్నారు.
ఇక ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ నిర్మించగా విజయ్ బుల్గానీస్ సంగీతం అందించాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy