Old Man Bicycle :సైకిల్‌పై అద్భుతమైన విన్యాసాలు చేస్తున్న వృద్ధుడు.. వీడియో వైరల్..

సాధారణంగా 70 ఏళ్లు దాటిన తర్వాత చాలామంది నడవడానికే కష్టపడి పోతుంటారు.ఇక సైకిల్ కూడా తొక్క లేరు.

ఒకవేళ తొక్కినా వాటిని చాలా చిన్నగా మెల్లిగా నడుపుతుంటారు.ఎందుకంటే వారిలో ఉత్సాహం, ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది.

కాగా తాజాగా ఒక వృద్ధుడిలో మాత్రం ఉత్సాహం ఉరకలేసింది.అంతే అతడు సైకిల్ పైకి ఎక్కి అద్భుతమైన విన్యాసాలు చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.దీన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Advertisement

వావ్, మీరు గ్రేట్ తాత అని పొగుడుతున్నారు.లైఫ్ ఎంజాయ్ చేయడమంటే ఇదే అని ఇంకొందరు ఆ వృద్ధుడి విన్యాసాలు చూసి అంటున్నారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు సైకిల్‌పై ఎక్కి చాలా వేగంగా దూసుకెళ్లడం చూడవచ్చు.తరువాత అతను తన రెండు చేతులను వదిలేసి ఇంకా వేగంగా తొక్కుతూ ఆశ్చర్యపరిచాడు.ఈ సమయంలో వర్షం పడుతుండగా అతడు ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ తనలోని ఉత్సాహాన్ని బయటపెట్టాడు.

ఈ దృశ్యాలను అతని వెనకే వెళ్తున్న ఒక వాహనదారుడు రికార్డ్ చేశాడు.అనంతరం ఆ వీడియోను ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అనే ఒక క్యాప్షన్‌తో ట్విట్టర్ యూజర్ దీనిని షేర్ చేశాడు.షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఇప్పటికే 80 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.6 వేల వరకు లైక్స్ వచ్చాయి.దీన్ని చూసిన ఇంటర్నెట్ యూజర్లు.

ఈ తాత మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు.మీరు సూపర్ తాత అని కామెంట్ చేస్తున్నారు.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు