హైదరాబాద్ లో ప్రత్యక్షమైన అమ్రీష్ పురి మనవడు.. టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ఏంటి?

ఇదివరకు కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప గొప్ప విలన్లను మనం చూసాం.

అందులో ఎక్కువగా పాపులారిటీ సంపాదించిన వారిలో ఆమ్రేష్ పూరి( Amrish Puri ) గురించి ముందుగా చెబుతారు.

ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోకసుందరి, మేజర్ చంద్రకాంత్ ఇలా చాలా సినిమాలలో నటించిన ఆయన 2005లో కన్నుమూశారు.అయితే ఆ తర్వాత ఆమ్రేష్ పూరి ఆయన వారసత్వంగా మనవడు ప్రస్తుత కాలంలో కాస్త హైలెట్ అవుతున్నాడు.

ఇప్పటివరకు కేవలం హిందీ పరిశ్రమకే పరితమైన ఆయన సౌత్ ఇండియాలో కూడా తన నట ప్రస్థానాన్ని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నట్లు కనబడుతోంది.అమ్రేష్ పూరి మనవడి పేరు వర్ధన్ పూరి.

( Vardhan Puri ) ఈయన తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్టులో( Hyderabad Airport ) అడుగుపెట్టాడు.అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఆ ఫోటోలను చూస్తే అతి త్వరలో టాలీవుడ్ లో( Tollywood ) కూడా తన పేరును మారుమోగేలా కనిపిస్తున్నాడు.ఈ ఫోటోలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు అతి త్వరలో తాత పేరును నిలిపే వాడిలా టాలీవుడ్లో నిలబడతాడంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇకపోతే వర్ధన్ తన 5వ ఏటనుండే నాటకాలలో నటించడం మొదలుపెట్టేసాడు.ఆ తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆపై రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా యే సాలి ఆషికి సినిమాలో హీరోగా 2019లో నటించాడు.ఇకపోతే ఆ సినిమా కథను అతడే రాయడం ఒక కొసమెరుపు.

ఆ సినిమా డిజిటల్ ప్లాట్ఫారంలో భారీ హిట్ అయింది.ఆ తర్వాత ఆయన పలు బాలీవుడ్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం వర్ధన్ నెక్స్ట్ టు గాడ్( Next To God ) అనే మెడికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలో నటించబోతున్నాడు.ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలకానుంది.ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
God Of Coins Player Safety And Responsible Gambling (UK)

ఈ సినిమాలో భారతీయ వైద్యులు ఎదుర్కొన్న నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి మీడియా ప్రతినిధులు అతనితో చర్చించగా.

Advertisement

ఈ సినిమాలో నటించడం మీకు ఏమైనా కష్టమా అని అడిగినప్పుడు ఆయన తనకు ఎలాంటి బత్తిని కూడా లేదంటూ తెలియజేశాడు.చూడాలి మరి ఈ యంగ్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తాడో లేదో.

తాజా వార్తలు