వారితో కలిసి కల్కి సినిమా చూడాలని ఉంది.. అశ్వర్థామా కామెంట్స్ వైరల్!

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ( Nag Aswin ) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) నటించిన తాజా చిత్రం కల్కి( Kalki ) ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ ఇండియాలో కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ సంచలనాలను సృష్టిస్తుంది.

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే డైరెక్టర్ బాలీవుడ్ నటుడు అమితాబ్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Amithab Bachchan Interesting Comments On Kalki Movie , Amithab Bachchan, Kalki M

ఈ ఇంటర్వ్యూలో భాగంగా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఇందులో భాగంగా ఈ చిత్రంలో అశ్వత్థామ పాత్రలో నటించిన అమితాబ్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది.

అయితే ఈ విషయంపై అమితాబ్ మాట్లాడుతూ.కల్కి లో చేసినందుకు వస్తోన్న ప్రశంసలు నా నటనకు అనుకోవడం లేదు.

Advertisement
Amithab Bachchan Interesting Comments On Kalki Movie , Amithab Bachchan, Kalki M

ఆ పాత్ర, కాన్సెప్ట్‌కు వస్తున్నాయి.

Amithab Bachchan Interesting Comments On Kalki Movie , Amithab Bachchan, Kalki M

ఇలాంటి ఒక గొప్ప ఐడియా వచ్చినందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు తెలపాలి.ఇక ఇందులో దీపిక పదుకొనే( Deepika Padukone ) పాత్ర చాలా అద్భుతంగా ఉంది.ముఖ్యంగా ఆమె మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సన్నివేశం హైలెట్ అని తెలిపారు.

ఈ సీన్ గురించి ప్రేక్షకుల స్పందన అడిగి తెలుసుకోవాలని ఉందని ఈయన తెలిపారు.ఇకపోతే కల్కి సినిమాని తాను తెలుగు ప్రేక్షకులతో కలిసి చూడాలని ఉంది అంటూ ఈ సందర్భంగా అమితాబ్ చేసిన ఈ కామెంట్స్  వైరల్ అవుతున్నాయి.

తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఈయన తెలిపారు.ఇక ఈ సినిమాలో అమితాబ్ తో పాటు  కమల్ హాసన్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు